ఎపికి ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి

 క్యాట్ ను ఆశ్రయించడంతో ఎట్టకేలకు శ్రీలక్ష్మికి ఊరట


ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో తీవ్ర నేరారోపణలు ఎదుర్కుని జైళకు వెళ్ళిన శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారిణి పట్టిబట్టి తానుతెలంగాణ రాష్ట్రంలో ఉండబోనంటూ తిరిగి అంధ్ర ప్రదేశ్ కు అలాట్ చేయించుకుంది. వై.ఎస్ మరణానంతరం శ్రీలక్ష్మి తో పాటు కొందరు అధికారులపై వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డితో సహ  సిబిఐ కేసులు నమోదు చేయడంతో  జైళుకు వెళ్లారు. కేసుల  అనంతరం ఆమె జైళు నుండి విడుదల అయిన తర్వాత సస్పెన్షన్ ఎత్తి వేయడంతో తెలంగాణా కు కేటాయించారు. అయితే శ్రీలక్ష్మి కి తెలంగాణా లో పనిచేయడం మొదటి నుండి ఇష్టం లేదు. ఆమె ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లాలనుకున్నా అప్పట్లో  అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండడం వల్ల ఆ రాష్ట్రానికి వెళ్లేందుకు ఇష్ట పడే లేదు. కాని వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం అంధ్ర ప్రదేశ్ కు వెళ్లేందుకు ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కల్సి  తీవ్ర ప్రయత్నాలు చేసింది. కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు ఇతర మంత్రువ సహాయం కోరింది అయినా లాబ ంలేకపోవడంతో చివరికి డిప్యుటేషన్ అయినా ఇవ్వాలని కోరింది కాని అందుకు కేంద్రం అంగీకరించ లేదు. దాంతో శ్రీలక్ష్మి క్యాట్ ను ఆశ్రయిచింది. తన స్వంత జిల్లా శ్రీకాకుళం అని తన తండ్రి రైల్వే శాఖలో పనిచేయడం వల్ల తెలంగాణ లో అయన పనిచేసిన సమయంలో ఇచ్చిన పోస్టల్ అడ్రస్ కారణంగా తెలంగాణాకు కేటాయించారన్నారు. క్యాట్ లో శ్రీలక్ష్మి వాదనలు నెగ్గడంతో ఆమెను రీలీవ్ చేయాలని క్యాట్ ఆదేశాలు జారే చేసింది. దాంతో శ్రీలక్ష్మి తెలంగాణ నుండి రీలీవ్ అయి ఎపిలోని అమరావతిలో రిపోర్టు చేసారు.

వై.ఎస్ మఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు కీలక పదవులు నిర్వహించిన శ్రీలక్ష్మి కి తిరిగి వై.ఎస్ జగన్ కీలక పదవులు అప్పగించ వచ్చనే  ఊహాగానాలు సాగుతున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు