సింధు ఆదర్శ్‌రెడ్డే గ్రేటర్ కు కాబోయే మేయరా ?

 


గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎవరు ?
 ఎవరైనా అధికారం టిఆర్ఎస్ పార్టిదే కనుక ఆ పార్టి అభ్యర్థే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్ అఫీషియో మెంబర్లతో పాటు ఎంఐఎం పార్టి అభ్యర్థుల మద్దతు టిఆర్ఎస్ కు తప్పని సరి అయ్యాయి. మేయర్ పీఠం దక్కాలంటే 102 మాజిక్ ఫిగర్ కోసం టిఆర్ఎస్ కు  బయటి నుండి మద్దతు అవసరం ఏర్పడింది. టిఆర్ఎస్  56 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది.  ఎక్స్ అఫీషియో మెంబర్లకు తోడు ఆ పార్టీకి 8 మంది మద్దతు తప్పని సరి అవసరం. ఆ మద్దతు ఎంఐఎం నుండి పొందే అవకాశాలు మాత్రమే మిగిలాయి. అదేం పెద్ద సమస్య కాదని టిఆర్ఎస్  ఆ పార్టి మేయర్ అభ్యర్థి కోసం సన్నాహాలు   మొదలు పెట్టింది.  మేయర్ పదవి మహిళ జనరల్ క్యాటగరీకి చెందడంతో టిఆర్ఎస్ నుండి గెలిచిన మహిళల్లో అందరూ  ఈ పదవికి  అర్హులే అని చెప్పవచ్చు.   

 ఖైరతాబాద్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి, బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన టీఆర్‌ఎస్ కీలక నేత, ఎంపీ కే కేశవ రావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి , అట్లాగే మేయర్ బొంతు రాం మోహన్ సతీమని బొంతు శ్రీదేవి చర్లపల్లి నుండి గెలిచారు. వీరందిరిలో సింధు ఆదర్శ్ రెడ్డికే అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. పార్టి అధిష్టానం దృష్టిలో ఆమెకు ప్రాధాన్యత లభించింది. అందుకే ఆమెకు ప్రగతి భవన్ నుండి పిలిపు వచ్చింది. ఏ ఆటంకాలు లేకుండా ఉంటే సింధు ఆదర్శ్ రెడ్డే మేయర్ గా ఎంపిక కానుందని టిఆర్ఎస్ పార్టి వర్గాల్లో చర్చ సాగుతోంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు