పాత పద్దతిలోనే ఇక రిజిస్ట్రేషన్లు

 


వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత పద్దతుల్లోనే జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారి చేసింది.  కార్డ్ (సిఏఆర్ డి) విధానంలోనే రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను  ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు బుక్ చేసుకున్న స్లాట్ లకు మాత్రం రిజిస్ట్రేషన్లు కొనాసాగుతాయి. కొత్త విధానంలో  స్లాట్ బుకింగ్ ప్రక్రియను  నిలిపి వేశారు.  ధరణి విషయంలో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులతో పాటు హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో  ప్రభుత్వం చివరికి పాత పద్దతి లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని నిర్ణయించింది. 

కొత్త విధానంలో వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగ చేసేఅనేక లోపాలు ఉన్నాయని హైకోర్టు సీరియస్ అయింది. ఆధార్, కులం, కుటుంబ సబ్యులు వివరాలు, సామాజిక హోదా,తదితర వివరాలను కొత్త మాన్యువల్ లో సవరించాలని హై కోర్టు ఆదేశించింది. మాన్యువల్ సవరించే వరకు రిజిస్ట్రేషన్లు నిలిపి వేయాలని హై కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం  పాత పద్దతినే తిరిగి ఎంపిక చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో ఇక రిజిస్ట్రేషన్లన్ని సబ్ రిజిస్ట్రార్  కార్యాలయాల్లోనే జరగనున్నాయి.

న్యాయ పరమైన సమస్యల కారణంగా ఇప్పట్లో కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు జరిగే పరిస్థితి లేదు. కొత్తవిధానంలో పూర్తిగా వివాద రహిత అంశాలతో కూడిన నిభందనలు చేర్చిన అనంతరం హై కోర్టు సంతృప్తి చెందిన తర్వాతే కొత్త పద్దతిలో రిజిస్ట్రేషన్లు అమలు చేస్తారు. అయితే కొత్త పద్దతి ముందు మందు అమలు చేస్తారా లేదా అనేది కూడ నమ్మకం లేదు.

ఇప్పటికే తలెత్తిన సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచి పోయి గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అటు సామాన్యులకు, రియల్టర్లకు  ఆర్థిక నష్టాలు తెచ్చి పెట్టింది. వ్యక్తుల నష్టం కన్నా  మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు లేక ప్రభుత్వం వేలకోట్ల రూపాయల నష్టం చవిచూసింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు