పోగొట్టుకున్న బంగారు ఆభరణాల పర్స్ ను అంద చేసిన పోలీసులు

 


కాశిబుగ్గ ప్రాంతంలో ఓ మహిళ ఏటిఎం లో నగదు డ్రా చేసేందుకు వెళ్లి అక్కడే బంగారు ఆభరణాలు ఉన్న పర్స్ మరిచి పోగా  వరంగల్ ఇంతెజార్ గంజ్ పోలీసులు వెదికి పట్టుకుని  తిరిగి ఆ పర్సును మహిళకు అంద  చేసారు.

గత నెల 29 వ తేదీన కోట హరిణి అనే మహిళ ఎస్అం బిహెచ్ ఎటిఎంలో నగదు విత్ డ్రా చేసేందుకు వెళ్ళింది. ఎటిఎం మిషన్ పై పర్స్ పెట్టి నగదు విత్ డ్రా చేసుకుని పర్స్ అక్కడే మరిచి పోయింది. కొద్ది సమయం తర్వాత పర్స్ మరిచి పోయిన విషయం గుర్తుకు వచ్చి ఎటిఎంలో వెదకగా కనిపించ లేదు. దాంతో ఆ మహిళ ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పర్స్ లో లక్ష 80 వేల రూపాయల విలువ  చేసే  30 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.  పోలీసులు ఎటిఎం లో ఉన్న సిసి కెమెరాలు పరిశీలించగా కరీమాబాద్ కు చెందిన ఓ మహిళ ఆ పర్స్ తీసుకు వెళ్లిన దృష్యాలు కనిపించాయి.  ఆ మహిళ నుండి పర్స్ ను స్వాదీనం చేసుకుని  పోగొట్టుకున్న మహిళకు అంద చేసినట్లు ఇంతె జార్ గంజ్ ఇన్స్ పెక్టర్  వెంకటేశ్వర్లు తెలిపారు.

ఎవరైనా హడావుడిలో ఎటిఎం  కేంద్రాలలో వస్తువులు, ఎటిఎం కార్డులు మరిచి పోయిన సందర్బాలు తరుచూ జరుగు తుంటాయని వాటిని చూసిన వారు ఇంటికి తీసుకు వెల్ళకుండా దగ్గర  లోని పోలీస్ స్టేషన్లలో అంద చేస్తే  వాటిని పొగొట్టుకున్న వారికి అంద చేసే అవకాశం ఉంటుందని ఇన్స్ పెక్టర్ సూచించారు.తన పర్స్ వెదికి ఇచ్చి నందుకు పోలీసులకు  మహిళ కృతజ్ఞతలు తెలియ చేెసారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు