నూతన పార్లమెంట్ భవణ నిర్మాణానికి మోది శంకు స్థాపన


ఆధునిక హంగులతో నిర్మించనున్న నూతన పార్లమెంట్ భవణ నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోది గురువారం శంకుస్థాపన చేసారు.  సంసద్ మార్గ్ లో రూ.971 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 64,500 చదరపు మీటర్ల వైశాల్యం కలిగిన భవణం నిర్మించ తలపెట్టారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ వెంకటేశ్‌ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌ తదితరులు హాజరయ్యారు. కోవిడ్ నిభందనల కారణంగా కేవలం 200 మంది ప్రముఖులను మాత్రనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. 

ప్రస్తుతం పార్లమెంట్ భవణం నిర్మించి వందేల్ళు పూర్తి  కావచ్చిన సందర్భంగా నూతన పార్లమెంట్ భవణ నిర్మాణం మొదలు పెట్టినట్లు కేంద్రం పేర్కొంది.

భూకంపాలను సైతం తట్టుకునే రీతిలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు పూర్తి సౌకర్య వంతంగా ఉండేలా ప్రతిపాదనలు సిద్దం చేశారు.

ఈసందర్భంగా ప్రదాన మంత్రి నరేంద్ర మోది మాట్లాడుతూ నూతన భవణం భారతీయులకు ఎంతో గర్వకారణ మన్నారు. భారతీయుల ఆకాంక్షలకు ప్రతీకగా నిలువ బోతున్నదని అన్నారు. ‘‘అంబేడ్కర్‌ వంటి మహనీయులు సెంట్రల్‌ హాల్‌లో రాజ్యాంగ రచన చేశారు. చరిత్రను గౌరవిస్తూనే వాస్తవ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

నూతన భవనంలో అనేక సౌకర్యాలు రానున్నాయి. కొత్త భవనం ఎన్నో విశిష్టతలతో రూపుదిద్దుకోబోతోంది. ప్రస్తుత భవనం స్వాతంత్ర్యం తర్వాత దేశానికి దశదిశ నిర్దేశించింది. నూతన భవనం ఆత్మనిర్భర్‌ భారత్‌కు దిశానిర్దేశం చేయనుంద’’ని అన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు