కూతురు పెండ్లికి రావాలని సిఎం కెసిఆర్ ను ఆహ్వానించిన పనికర మల్లయ్య


పనికర మల్లయ్య..ఈ పేరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాదులకు సుపరిచితం. తన కూతురు పెండ్లికి  రావాలని మల్లయ్య కూతురుతో సహా సిఎం కెసిఆర్ ను హైదరాబాద్ లో సోమవారం ప్రగతి భవన్ లో కల్సి శుభరాక ఇచ్చి ఆహ్వానించారు.

తమ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకున్న  సిఎం కెసిఆర్ ను కూతురు వివాహానికి వచ్చి ఆశీర్వదించాలని కోరామని మల్లయ్య చెప్పారు. 

వరంగల్ ఉమ్మడి జిల్లా రాయపర్తి గ్రామానికి చెందిన ఓ పేద రైతు పనికర మల్లయ్య. తెలంగాణ రాష్ట్రం రాకుండా అడుగడుగునా అడ్డుకునే యత్నంలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో  2008 లో ఓదార్పు యాత్ర చేెసాడు. ఆ సమయమలో చంద్రబాబు నాయుడు రాయపర్తి మండలంలో ప్రధాన రహదారి వెంట వెళుతుండగా రోడ్డు పక్కన పొలంలో పనులు చేస్తున్న పనికర మల్లయ్య ను చూసి అతని దగ్గరికి వెళ్ళి యోగ క్షేమాలు విచారించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రేస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది ఇంకా మీ సమస్యలు ఏమిటని అడిగారు. చంద్రబాబు నాయుడుకు సమస్యలు వివరించిన మల్లయ్య చివరగా మాకు మా తెలంగాణ కావాలి సార్ అని చెప్పాడు.  నాయుడు ఊహించని  సమాధానంతో చంద్ర బాబు నాయుడు అక్కడ ఒక్క క్షణం కూడ ఉండకుండా వెను తిరిగారు. ఆయన వెంట ఇప్పుడు మంత్రిగా ఉన్న యెర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. 

పనికర మల్లయ్య తెలంగాణ కావాలని అడిగిన ప్రశ్న సంచలనం అయింది. మీడియాలో పతాక శీర్షికలో వార్తలు వచ్చాయి.  దాంతో పనికర మల్లయ్య పేరు మారు మోగి పోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2015 లో సిఎం కెసిఆర్ మల్లయ్యను ప్రగతి భవన్ కు పిలిపించి  అభినందించారు. ఆయనకు ఓ ఇళ్లుతో పాటు ఇద్దరు కూతుర్లకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. సిఎం చేసిన సహాయంతో మల్లయ్య ఇద్దరు కూతుర్లను చదివించారు. కూతురు వివాహం  నిశ్చయం కాగా సిఎం కెసిఆర్ కు శుభరాక ఇచ్చి ఆయన్ని పెండ్లికి ఆహ్వానించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు