జమిలి ఎన్నికలు రావచ్చు..సిద్దంగా ఉండాలన్న కెటిఆర్దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుకు అందరూ  సిద్దంగా ఉండాలని ఆదివారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేల సమావేశంలో టిఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. గ్రేటర్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుని రాబోయే ఎన్నికలపై దృష్టిపెట్టాలన్నారు. గ్రాడుయేట్ ఎమ్మెల్సి ఎన్నికల్లో పార్టి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు.

గ్రేటర్ ఫలితాలు విశ్లేషిస్తు గెలుపు ఓటములు సహజమేనని అన్నారు. అభివృద్ధి పనులు కొనసాగిలస్తూ ముందుకు సాగాలని అన్నారు.  గ్రేటర్ ఎ్ననికలలో సిట్టింగ్ కార్పోరేటర్ల విషయంలోనే లెక్క తప్పిందనని అన్నారు. సిట్టింగ్ లను మార్చిన చోట గెలిచామని తెలిపారు. 


ఈ నెల 8 వ తేదీన జరిగే బారత్ భంద్ ను విజయ వంతం చేయాలని కెటిఆర్ కోరారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు పూర్తిగా సహకరించాలని ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు బంద్ ను విజయవంతం చేసేందుుక కృషి చేయాలని అన్నారు.  తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ప్రతి గల్లీలో కూడ బంద్ జరగాలన్నారు. రైతులకు నష్టం కలుగ చేసే కేంద్ర వ్యవసాయచట్టాలు వెనక్కి తీసుకోవాలని కెటిఆర్ డిమాండ్ చేసారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు