పఠాన్ చెరువు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని జర్నలిస్టుల డిమాండ్


జర్నలిస్టును తిట్టి నరుకుతానంటూ బెదిరించిన పఠాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన జరిపారు.  పఠాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భూ కబ్జాల గురించి వార్త రాసిన జర్నలిస్ట్ సంతోష్ ను ఫోన్ లో  బూతులు తిట్టినందుకు తెలంగాణ జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నాలు చేసారు. మెదక్ జిల్లా కేంద్రంలో  ఆయన దిష్టి బొమ్మ దగ్దం చేసారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.  తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్టుల సంఘం (టిజెఎఫ్) ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ సహా పలువురు జర్నలిస్టు సంఘాల నేతలు ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని ఖండించారు. జర్నలిస్టుల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యేను తక్షణం అరెస్ట్ చేయాలని మారుతి సాగర్ డిమాండ్ చేసారు.

ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐజెయు కార్యవర్గ సభ్యుడు దాసరి కృష్ణా రెడ్డి డిామాండ్ చేసారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.

ఎమ్యెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కేసు నమోదైనంత మాత్రన తాము శాంతించేది లేదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) డిమాండ్ చేసింది. ఈ మేరకు జర్నలిస్టులకు, మీడియాకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేపై కేసు నమోదు 

జర్నలిస్టు సంతోష్ ను దూషించి నరుకుతానంటూ బెదిరించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై కేసు నమోదు చేసారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సి ఎస్టి అట్రాసిటి కేసు నమోదు చేసారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు