జర్నలిస్టును దూషించిన కేసులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు నోటీసులు


ఓ జర్నలిస్టును దూషించిన కేసులో పోలీసులు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి నోటీసులు అంద చేశారు. ఎమ్మెల్యే అనుచరులు జాతీయ రహదారి పక్కన గల స్థలాన్ని ఆక్రమించారని సంతోష్ అనే జర్నలిస్టు వార్త రాయగా  ఎమ్మెల్యే ఆగ్రహం చెంది సంతోష్ ను ఫోన్ లో ఇష్టం వచ్చినట్లు  తిట్టాడు. నా పేరు పెట్టి వార్త రాస్తావా ఎంత ధైర్యం నీకు అంటూ కాళ్ళుచేతులు నరుకుతానంటూ దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ ఎమ్మెల్యే దూషించాడు. తన కాల్ రికార్డు చేసు కోమంటూ తానెవరికి భయపడనంటూ మాట్లాడాడు.

ఎమ్మెల్యే ప్రవర్తనను జర్నలిస్టు సంఘాలు ఖండిస్తు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశాయి. సంతోష్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

దాంతో గురువారం ఎమ్మెల్యే పటాన్ చెరు డిఎస్పి కార్యాలయానికి వెళ్ళారు. ఎమ్మెల్యేకు డిఎస్పి భీమ్ రెడ్డి కేసుకు సంభందించిన నోటీసులు అంద చేశారు.  నోటీసులకు వివరణ కోరామని డిఎస్పి తెలిపారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు