విజయ వాడలో బిసి సంక్రాంతి సభ - 56 కార్పోరేషన్ల చైర్మన్ల ప్రమాణ స్వీకారోత్సవం

 బీసి సంక్రాంతి సభలో 56 కార్పోరేషన్ల చైర్మన్లు,డైరెక్టర్ల సామూహిక ప్రమాణ స్వీకారం


ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 56 బీసి కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను , డైరెక్టర్లను నియిమంచారు. ఈ సందర్బంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బీసీ సంక్రాంతి సభ పేరిట వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. 

“బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నుముక కులాలు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. 18 నెలల్లోనే బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం” అని డగన్ అన్నారు. 

“బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు మీ సామాజిక వర్గంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా బాధ్యత తీసుకోవాలి. కార్పొరేషన్లలో సమూల మార్పులు రావాలి. రాజకీయాలకు సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం” అని దిశా నిర్దేశం చేశారు. 

జగనన్న చేదోడు కింద 2.98 లక్షల మందికి రూ.298 కోట్లు అందించా మన్నారు. ఆరోగ్యశ్రీతో 5.24 లక్షల మంది బీసీ కుటుంబాలకు లబ్ది జరిగిందని తెలిపారు.  వైఎస్ఆర్ పెన్షన్ కింద 18 నెలల్లో రూ.25వేల కోట్లు ఖర్చు చేశామని , వైఎస్ఆర్‌ పెన్షన్‌తో 61.94 లక్షల మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు రాష్ట్రంలో  90.37 లక్షల మంది డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ అందించామని ఆసరా, చేయూత పథకాలతో అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలిచా మని విద్యాదీవెనతో 18.57 లక్షల మందికి రూ.3857 కోట్లు అందించా మని చెప్పారు. విద్యా కానుక పథకానికి రూ.648 కోట్లు ఖర్చు  తో 42.34లక్షల మందికి లబ్ది చేకూర్చామని గోరుముద్ద పథకంతో 32.52 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగిందని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణతో 30.16లక్షల మందికి లబ్ధి చేకూరిందని అని జగన్  పేర్కొన్నారు.వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు