ఏలియన్స్ తో అమెరికా డీల్ - ఇజ్రాయిల్ మాజి స్పేస్ చీఫ్ హెయిమ్ షెడ్

 


గ్రహాంతర వాసులు - ఏలియన్స్ గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఎక్కడో ఏలియన్స్ కనిపించారని వారు ఫ్లైయింగ్ సాసర్ లో ఎగురుతూ వచ్చి భూమి మీద దిగారని ఇలాంటి కథలు పత్రికల్లో కూడ వచ్చాయి. ఇలాంటి రూఢి లేని వార్తలు చూసి ఏలియన్స్ గురించి ఊహాజనిత పాత్రలతో  కొన్ని  సినిమాలు కూడ వచ్చాయి. అయితే ఏలియన్స్ విషయంలో  వాస్తవాలు ఏంటనేది మాత్రం ఇప్పటికి  ప్రపంచంలో  ఎవరూ సరిగ్గా రుజువు చేయ లేక పోయారు. కాని ఇజ్రాయిల్ మాజి స్పేస్ చీఫ్ హెయిమ్ షెడ్ మాత్రం తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. గ్రహాంతర వాసులు ఈ ప్రపంచాన్ని పరిశీలిస్తున్నారనీ, అధ్యయనాలు  చేస్తున్నారని ఎలియన్స్ తో అమెరికా ఏకంగా డీల్ కుదుర్చు కున్నదంటూ  సంచలన ప్రకటన చేసాడు. ఈ విషయం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు కూడ తెల్సునని ఆయన ఉత్సుకత ఆపుకోలేక బయటకి వెల్లడిస్తానంటే అందుకు గెలాక్టిక్ ఫెడరేషన్ అంగీకరించ లేదని ఇప్పుడప్పుడే ప్రపంచానికి తెలియ కూడదని జాగ్రత్త పడ్డారని అన్నారు. 

గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఏలియన్స్ (Galactic Federation of Aliens) అనే వ్యవస్థ ఒకటి ఉందని హెయిమ్ షెడ్ వివరించారు. ఈ వ్యవస్థలోని ఏలియన్స్‌తో అమెరికా తో పాటు ఇజ్రాయెల్ ప్రభుత్వాలు అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నాయని హెయిమ్ షెడ్ వివరించారు. ఏలియన్స్‌కి సంబంధించిన ప్రతినిధులు... అమెరికాలో ఉన్నారని హెయిమ్ అంటున్నారు. ఈమధ్యే అమెరికా ఆర్మీలో స్పేస్ ఫోర్స్ (SPACE FORCE) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారనీ... ఇందుకు కారణం ఏలియన్సే అని ఆయన చెబుతున్నారు. 

ఇజ్రాయెల్‌ అంతరిక్ష భద్రత విభాగం మాజీ జనరల్  గా పనిచేసి  ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 87 ఏళ్ల హెయిమ్ షెడ్  జెరూసలేం పోస్టుకిచ్చిన ఇంటర్వ్యూలో  తెలిపారు. 

“అమెరికా ప్రభుత్వం, గ్రహాంతరవాసుల మధ్య ఒక ఒప్పందం ఉంది. ఇక్కడ ప్రయోగాలు చేయడానికి వారు మాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారు కూడా, విశ్వం మొత్తాన్ని పరిశోధించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు మనల్ని సహాయకులుగా కోరుకుంటున్నారు. అంగారక గ్రహం పై భూగర్భ స్థావరం ఉంది, అక్కడ గ్రహాంతర వాసుల ప్రతినిధులు, మన అమెరికన్ వ్యోమగాములు కూడా ఉన్నారు” అని తెలిపారు. తాను చెప్పిన వన్ని వింటే కల్పిత గాధల లెక్క ఉంటాయని అన్నారు. గత కొన్నేళ్ల క్రితమే తానీ విషయాలు చెప్పాలను కున్నానని కాని పిచ్చివాడిలా చూస్తారని చెప్పలేదన్నారు. అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గతంలో చాలా సార్లు ఇలాంటి కథనాలను కొట్టి పారేసింది.  అయితే తాను  ఎలియన్స్ గురించి నిరూపించ గలనని హెయిమ్ షెడ్  స్పష్టం చేయడం గమనార్హం. 

 ఏలియన్స్  విషయంలో హెయిమ్ షెడ్ చెప్పిన వన్ని నమ్మాలో లేదో ఎవరికి వారు నిర్ణయించు కోవాలి ఉంటుందని అంజర్జాతీయ మీడియా పేర్కొంది. ఎలియన్స్ అమెరికాతో కల్సి అధ్యయనాలు కొన సాగించడం ఎందుకు భూ గ్రహం మీద దిగిన ఏలియన్స్ మార్స్ మీద దిగ లేరా వారికి అమెరికా సాంకేతిక సహాయం ఎందుకు కావల్సి వచ్చింది. ఏలియన్స్ కన్నా అంతరిక్ష ప్రయోగాలలో  అమెరికా ముందంజలో ఉందా ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు. కాని భూమి మీద ఉండే మనుషులు ఎలియన్స్ గురించి అర్దం చేసుకునేంతగా అభివృద్ధి కాలేదని అందుకు వారు సిద్దపడిన సమయంలో ఈ విషయాలన్ని వెలుగు చూస్తాయని  అన్నారు.


  

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు