సోనూకు గుడి కట్టిన తెలంగాణ అభిమాని

 సిద్దిపేట జిల్లా దుబ్బ తండా పరిధిలోని చెలిమి తండా అనే చిన్న గ్రామంలో సోను విగ్రహం


మన దేశంలో వ్యక్తి ఆరాధన కొంచెం ఎక్కువే. ఆరాధన తో పాటు ఆగ్రహం కూడ తక్కువేమి కాదు. అందుకే నచ్చితే తెగ మెచ్చేసు కుంటారు. దేవుడిలా కొలుస్తారు. కొందరు గుండెలో పెట్టుకొని కొలిస్తే కొందరు గుడి కట్టించి మరీ కొలుస్తారు.  బాలివుడ్,టాలి వుడ్ ఆక్టర్ సోను సూద్ కు అట్లాగే గుడి కట్టించి తన భక్తిని చాటుకున్నారు. ఎక్కడో  కాదు తెలంగాణ రాష్ట్రం లోని  సిద్ది పేట జిల్లాలో   దుబ్బ తండా పరిధిలోని చెలిమి తండా అనే చిన్న గ్రామంలో. సోను సూద్ కు రాజేశ్‌ రాథోడ్‌ అనేవ్యక్తి  విగ్రహం ఏర్పాటు చేసి గుడి కట్టాడు. 

ప్రపంచ వ్యాప్తంగా సోనుసూద్ సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తింపు పొందాయి. ఐక్యరాజ్యసమితి కూడ సోను సూద్ ను ప్రత్యేకంగా  ప్రశంసించింది. కరోనా లాక్ డౌన్ కాలంలో శ్రామికులను వారి స్వస్థలాలకు చేర్చడంలో సోను సూసూద్ తన స్వంత ఖర్చులతో వాహనాలు సమకూర్చారు.  మానవతా సేవతో విలన్ రోల్స్ లో సినిమాల్లో కనిపించే సోనుసూద్ హీరో అయ్యాడు. 

చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య  చిత్రంలో సోను సూద్ విలన్ రోల్ చేస్తున్నాడు. షూటింగ్ సమయంలో తనను చిరంజీవి ఫైట్ సీన్ లో కొట్టాల్సి ఉండగా ఎన్నో మంచి పనులుచేసిన నిన్ను కొట్టలేక పోతున్నానంటూ కొట్టేందుకు ఇబ్బంది పడ్డాడంటు సోను సూద్ ట్వీట్ చేసారు. 

చిరు ఎంతో గొప్పవారని ‘నేను కలిసి పనిచేసిన ఎంతోమంది గొప్ప వ్యక్తుల్లో, మర్యాదపూర్వకమైన వారిలో ఒకరైన చిరంజీవి సర్‌ ఎంతో మంచి వ్యక్తని, లవ్‌ యూ సార్ అని పేర్కొన్నారు. దీనికి చిరు స్పందించి ‘ధన్యవాదాలు సోనూసూద్‌ నువ్వు మంచివాడివి, నువ్వు ఇలాగే ఎంతోమంది నిస్సహాయులకు సాయం చేయాలని, ఎన్నో లక్షల మందిలో ప్రేరణ నింపాలని ఆశిస్తున్నా. నీ శక్తి సామర్థ్యాలు మరింత వృద్ధి చెందాలని కోరుకుంటున్నా. నీ బంగారం లాంటి మనసుతో మరింత గుర్తింపు పొందుతావు’ అని ట్వీట్ చేశారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు