సుప్రీం కోర్టులో మోది సర్కార్ కు చుక్కెదురు

నూతన వ్యవసాయ చట్టాల అమలు నిలిపి వేయాలన్న  సుప్రీం కోర్టు


నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టులో మోది సర్కార్ కు చుక్కెదురు అయింది. రైతుల ఆందోళన నేపధ్యంలో నూతన వ్యవసాయ చట్టాల ప్రజా ప్రయోజన వాజ్యంపై దాఖలైన పిటిషన్ పై గురువారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాల అమలు నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రైతులు హాజరు కాక పోవడంతో కేసు విచారణను  వాయిదా వేసారు.  పిటిషన్లపై వెకేషన్ బెంచ్ విచారణ జరుపుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే తెలిపారు. 

మేది ప్రభుత్వాన్ని ఉద్దేశించి జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలు నిలిపి వేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలన్నారు. అయితే చట్టాలను నిలిపి వేయడం సాధ్యం అయ్యే పనికాదని ప్రభుత్వం చెప్పడంతో దీనిపై జస్టిస్ బాబ్డే స్పందిస్తూ, ముందే అలా చెప్పవద్దని దయ చేసి కోర్టు సలహాను పరిశీలించాలని అ్ననారు.  రైతు సంఘాలకు కూడ నోటీసులు జారి చేస్తామన్నారు.  తదుపరి విచారణ వింటర్ వెకేషన్‌లో జరుగుతుందని తెలిపారు. వెకేషన్ బెంచ్‌ని ఆశ్రయించేందుకు పిటిషనర్లకు అవకాశం కల్పించారు.

దేశ రాజదాని సరిహద్దులో రైతుల ఆందోళన మూడు వారులకు పైగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతున్నారు. ఆందోళన ఉధృతం చేసేందుకు రైతు సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంమాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి  కనిపించడం లేదు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు