తమిళ నాడులో గృహిణులకు వేతనాలు - కమల్ హాసన్ ఎన్నికల హామి

 


తమిళనాట నట ప్రముఖుల రాజకీయ విన్యాసాలు అరంభం అయ్యాయి. మక్కల్ నీధి మయ్యమ్  పార్టి ఏర్పాటు చేసిన కమల్ హాసన్ ఇప్పటికే ఎన్నికలను దృష్టిల పెట్టుకుని రాష్ట్రంలో యాత్రకు శ్రీకారం చుట్ట బోతున్నారు. మరో ప్రముఖ నటుడు రజిని కాంత్ రాజకీ ఆరంగేట్రం కోసం ముహూర్తం నిర్ణయించాడు. 2021 లో జరగనున్న తమిళ నాట ఎన్నికల్లో  స్టార్ యాక్టర్లే తమ పార్టీలకు ఇక స్టార్ కాంపేయినర్లుగా మారనున్నారు. మక్కల్ నీధి మయ్యమ్ పార్టి అధినేత కమల్ హాసన్ ఓ అడుగు ముందుకు వేసి ఎన్నికల మానిఫెస్టో అంశాలను ముందే ప్రకటించారు. దేశంలో ఇంత వరకు ఎక్కడా ఏ పార్టి ఇవ్వని రీతిలో ఆయన హామి ఇచ్చారు. మహిళకు ఆర్థిక  విప్లవం అంటూ ప్రతి గృహిణికి వేతనాలు ఇవ్వనున్నట్లు  కమల్ హాసన్ ప్రకటించారు.  గృహిణులకు ఉచితంగా హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు ఉచిత కంప్యూటర్లు కూడ అంద ఇస్తామని ప్రకటించారు.  గృహిణులే కాదు రైతులకు కూడ హామీలు ప్రకటించారు. రైతులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దు తామని ప్రకటించారు. 

కమల్ హాసన్ ప్రకటించిన గృహిణుల వేతనాల హామి దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశం కానుంది. ఇంత వరకు ఇలాంటి హామీలు ఏ పార్టి ఇవ్వ లేదు. గృహిణుల కోసం కమల్ హాసన్ సరి కొత్త ఆలోచనలతో ఎన్నికల బరిలో దిగితే తమిళ నాడులో మహిళలు కమల్ హాసన్ పార్టి వెనకాలే ఉంటారా లేదా అనేది ఎన్నికలు తేల్చ నున్నాయి.  

భారతీయ జనతా పార్టి ఏఐఏడిఎంకె తో ఇప్పటికే అలయన్స్ ప్రకటించింది. వైవిద్య భరిత నటుడిగా మెప్పు పొందిన కమల్ హాసన్  రాష్ట్రంలో తన కంటూ రాజకీయాలలో ఓ వైవిద్యం ఉండేలా వినూతన వ్యూహాలతో ఎన్నికల బరిలో నిలిచేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు