జో బైడెన్‌- కమలా హ్యారిస్‌ లకు టైం మాగజైన్ అవార్డు

 


అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక టైమ్‌ మ్యాగజైన్‌ అవార్డుకు జో బైడెన్‌- కమలా హ్యారిస్‌ లను ఎంపిక చేసింది.

టైం మాగజైన్ ప్రతి ఏటా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పేరుతో అత్యంత ప్రభావశీలుర జాబితా ప్రకటిస్తుంటుంది. ఈమేరకు 2020కు గానూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన జో బైడెన్‌- కమలా హ్యారిస్‌ ద్వయం సంయుక్తంగా ఎంపికయ్యారు. దీంతో బైడెన్‌-కమలా ద్వయానికి మరో విజయం దక్కినట్లయింది.

డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్ధులుగా పోటీపడిన జో బైడెన్, కమలా హ్యారిస్‌ అసలు గట్టిపోటీ ఇస్తారా అన్న పరిస్ధితి నుంచి ఏకంగా రిపబ్లికన్లపై సంచలన విజయం సాధించడం వరకూ ఓ చరిత్రగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీరు సాధించిన అద్భుత విజయంపై అమెరికాతో పాటు పలు దేశాల మీడియా, ఇతర ప్రముఖులు చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో టైమ్‌ మ్యాగజైన్‌ కూడా ఈ ఏడాది తమ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు కోసం సంయుక్తంగా బైడెన్‌-కమల ద్వయాన్ని ఎంపిక చేసింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు