దేశ ద్రోహ నేరంపై యువజర్నలిస్టును ఉరి తీసిన ఇరాన్

 శనివారంతెల్లవారు జామున ఉరి అమలు చేసినట్లు ఇరాన్ అధికారిక టివి ఛానెల్ వెల్లడి


టెహ్రాన్: ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఇరాన్ లో ఓ యంగ్ జర్నలిస్టును ప్రభుత్వం శనివారం తెల్లవారు జామున ఉరి తీసింది. ఇరాన్ ప్రభుత్వ అధికారక టివి చానెల్  IRNA అధికారిక న్యూస్ చానెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. 

 రౌహొల్లా జామ్‌ (47) అనే జర్నలిస్టు భూమి మీద అత్యంత అవినీతికి పాల్పడ్డాడని ఇరాన్ ప్రభుత్వం తీవ్ర మైన నేరారోపణ చేసి ఆ దేశ చట్టాల ననుసరించి కేసు నమోదు చేసింది.  అమద్ న్యూస్ వ్యవస్థాపకుడిగా అట్లాగే ప్రముఖ సామాజిక సేవా కార్యకర్తగా రౌహెల్లా జామ్ కు పేరుంది. 2017-18 సంవత్సరాలలో ఇరాన్ లో ధరల సంక్షోభం ఏర్పడి పెద్ద ఎత్తన ఆందోలనలు చెల రేగాయి. ఈ ఆందోళనలలో 25 మంది చనిపోయారు.  అమద్ న్యూస్ వ్యవస్థాపకుడైన రౌహెల్లా జామ్ ఈ ఆందోళనలలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన చేసిన నేరం ఏంటంటే తన న్యూస్ ఛానెళ్లలో ఈ ఆందోళనలను ప్రసారం చేయడమే. ధరల సంక్షోభం నెలకొనేందుకు కారణాలను విశ్లేషిస్తు ఆయన న్యూస్ ప్రసారం చేశాడు.

రౌహొల్లా జామ్‌ 2009 ఇరాన్ అధ్యక్ష ఎన్నికల అనంతరం ఫ్రాన్స్ కు పారిపోయి అక్కడే అమద్ న్యూస్ ఛానెల్ స్థాపించి టెలిగ్రాఫ్ యాప్ తో వార్తలు ప్రసారం చేశాడు. ఫ్రాన్స్ లో ఉన్న జామ్ ను ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ అత్యంత చాకచక్యంగా  స్వదేశానికి రప్పించాయి. తిరుగుబాటు ధోరణి ఉందని  ఇరాన్ జోక్యం చేసుకోవడంతో టెలిగ్రామ్ జామ్ యాప్  అక్కౌంట్ ను రద్దు చేసింది.  తిరుగుబాటు  గత సంవత్సరం అక్టోబర్ లో జామ్ ను అరెస్టు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.  పలు దేశాలకు చెందిన నిధా వర్దాలకు జామ్ ఏజెంట్ గాపనిచేస్తున్నాడని   అందుకే ఆయా నిఘా వర్గాలు ఆయనకు రక్షణ కల్పించాయని  దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లే రీతిలో జామ్ వ్యవహరిస్తున్నాడని ఇరాన్ ఆరోపించింది. ఫ్రాన్స్ సహా ఇతర దేసాలకు జామ్ గూఢాచిరిగా కూడ పనిచేశాడని ఇరాన్ తీవ్ర మైన ఆరోపణలు చేసింది. ఇరాన్ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు 2019 జూన్ లో మరణ శిక్షను విధించింది. జామ్ తండ్రి షియా మతాధికారి అయిన మహ్మద్ అలి జామ్ గొప్ప సంస్కరణ వాది గా ఆ దేసంలో గుర్తింపు ఉంది. ఆయన 1980లో ఇరాన్ ప్రభుత్వ విధాన నిర్ణయాధి కారిగా పనిచేశాడు.

జామ్ మరణ శిక్,ను ప్రపంచ దేశాల మానవహక్కులసంఘాలు వ్యతిరేకించినా లాభం లేక పోయింది. ఇరాన్ దేశ  అంతరంగిక వ్యవహారంలో జోక్యం చేసుకునే వీలులేకుండా ఉన్న తప్పుడు నేరా రోపణలకు ప్రపంచం చూస్తుండగానే జర్నలిస్ట్  జామ్ మరణ శిక్షలో ప్రాణాలు కోల్పో వాల్సి వచ్చింది.  

ఇరాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఆందోళన

ఇరాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది సెప్టంబర్ లో ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఇరాన్ లోజరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై ఓ నివేదిక విడుదల చేసింది.

ఇరాన్ లో ప్రజా ఆందోళనలను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా అణిచి వేస్తోందని నివేదికలో పేర్కొంది. చమురు ధరలపై జరిగిన ఆందోళనలో భాగంగా 2 లక్షల మంది పాల్గొనగా వేలాది మందిని అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టారని నివేదిక వెల్లడించింది. జైళ్లలో మగ్గుతున్న వారిలో 10 ఏళ్ళ స్కూలు పిల్లలు కూడ ఉన్నారని తెలిపింది. రేపులు, గల్లంతులు దేశంలో చోటు చేసుకున్నాయని న్యాయ వ్యవస్థ పూర్తిగా ఏకపక్ష తీర్పులను వెల్లడిస్తోందని ఆమ్నెస్టి ఇంటర్ నేషనల్ ఆరోపించింది.వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు