మీ ఇంటి గాలి కావాలా ?మీ ఊరి గాలి కావాలా ?


అవును మీకు ఏ గాలి కావాలంటే ఆ గాలి బాటిళ్లలో నింపి మంచి నీటి బాటిళ్ల లెక్క అందిస్తారు. ఆయితే  ఉచితంగా కాదు. డబ్బులకే అంద చేస్తారు. ఇంటి గాలికి ఊరి గాలికి దూరమైన వారి కోసం హోం సిక్ నెస్ భారిన పడకుండా ఉండేందు కంటూ యుకె లో ఓ కంపెనీ వినూతన ఆలోచన చేసి ఈ వ్యాపారం మొదలు పెట్టింది.  కరోనా మహమ్మారి కారణంగా రోజుల తరబడి ఇంటికి తన స్వంత టౌన్ కు దూరంగా  దేశం కానిదేశాలలో రోజులు నెలల తరబడి ఉండి పోతున్న వారి కోసం ఈ గాలి బిజినెస్ చేపట్టినట్లు కంపెని పేర్కొంది.  హోం సిక్ నెస్ ఫీల్ కాకుండా సీసాలో ఇంటి గాలి లేదా వారి టౌన్ గాలి పీలిస్తే చాలట సికి నెస్ పోతుందట. దాంట్లో ఎంత వరకు శాస్త్రీయత ఉందో కాని కంపెనీ మాత్రం ఇలా చెప్పి వ్యాపారం కొనసాగిస్తోంది. 500 ఎంఎల్ లీటర్ పరిణామంలో గల బాటిళ్ళలో గాలి నింపి విక్రయిస్తున్నారు. అర లీటర్ బాటిల్ ధర ఎంతంటే 33 అమెరికన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో సుమారు 2,400 రూపాయలు. 

  ప్రస్తుతం ఈ సంస్థ  ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్‌, నార్తర్న్ ఐర్లాండ్ నుంచి "ప్రామాణికమైన" గాలి బాటిళ్లను విక్రయిస్తోంది. విదేశాలలోని యూకే నివాసితులకు ఇంటి సువాసనను అందిస్తుంది. ఇక దీన్ని ఎలా వాడాలి అంటే బాటిల్‌ మీద కార్క్‌ స్టాపర్‌ ఉంటుంది. ఇంటి మీదకు ధ్యాస మళ్లితే.. దాన్ని తీసి.. ఆ వాసనలు పీల్చితే సరి. ఇక కస్టమర్‌ అభ్యర్థనల మేరకు దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన గాలిని అయినా సరే ఇలా బాటిల్‌లో నింపి డెలివరి చేస్తా మని కంపెని చెబుతోంది. ఇప్పటికే కెనడియన్‌ కంపెనీ విటాలిటీ ఎయిర్‌ రాకీ పర్వతాల తాజా గాలిని చైనా కొనుగోలు దారులకు అందిస్తున్నదట. మన దేశంలో కూడ ఈ గాలి వ్యాపారం మొదలు అవుతుందా లేదా చూడాలి. ఆంబానీయో లేదా ఆదానీయో ఈ వ్యాపారం మొదలు పెట్టినా ఆశ్చర్యం లేదు. పాశ్చాత్య దేశాలలో స్వచ్చమైన ఆక్సిజన్ కోసం మొదట ఆక్సిజన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే దాన్ని అనుసరించి మన దేశంలో కూడ ఆక్సిజన్ సెంటర్లు ఏర్పాటు చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు