ఎపి నూతన ప్రభుత్వ కార్యదర్శిగా ఆధిత్యనాధ్ దాస్

 


ఆదిత్య నాథ్ దాస్ ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రభుత్వ కార్యదర్శిగా నియ మితులయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న  ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవి కాలం ఈ నెల 31 తో ముగియనుంది. అదే రోజు ఆదిత్యనాధ్ దాస్ పదవి భాద్యతలు చేపట్ట నున్నారు.

సీఎస్‌ రేసులో మరో ముగ్గురు అధికారులు ఉన్నప్పటికీ వారంతా కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో ఆదిత్యనాథ్‌ దాస్‌ వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపారు. 1987 బీహార్‌ బ్యాచ్‌కు చెందిన ఆదిత్యనాథ్ దాస్ ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

నీలం సాహ్ని పదవి విరమణ అనంతరం ఎపి ప్రభుత్వ  ముఖ్య సలహా దారుగా పని చేయనున్నారు. ఇతర అధికారులలో స్వల్పమార్పులు చేశారు.ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీలక్ష్మి ఇటీవలే తెలంగాణ  క్యాడర్ నుండి ఆంధ్రకు బదిలి అయ్యారు. కొంత కాలం సిబిఐ కేసులు ఎదుర్కుని జైళ్లో గడిపిన అధికారి ఆతర్వాత తెలంగాణలో అయిష్టంగానే పనిచేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు