పెగ్గు పోయనందుకు స్నేహితున్ని పొడిచి చంపాడు

 


మందు తాగితే మత్తులో ఏమైనా  చేస్తారు. మందు కోసం కూడ  ఏమైనా చేస్తారు. ఉత్తర ప్రదేశ్ లో అదే జరిగింది. ఓ పెగ్గు అడిగితే లేదన్నందుకు  తన స్నేహితున్నే పొడిచి  చంపిన సంఘటన ఆలస్యంగా పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని శామ్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జస్బిర్‌,క్రిష్ణపాల్‌ ఇద్దరూ మంచి మిత్రులు. మందు తాగేందుకు ఓ మద్యం షాపుకు వెళ్లారు.  క్రిష్ణపాల్‌ తన వంతు మద్యం గడ గడా తేగాసాడు. అతని గ్లాసు ఖాలి కావడంతో తన స్నేహితుడు జస్బిర్‌ ను ఓ పెగ్గు పోయమని అడిగాడు. తన వరకే మద్యం ఉందని పెగ్గు పోయలేనని జస్బిర్‌ చెప్పడంతో క్రిష్ణపాల్‌ వాదనకు దిగాడు. ఇద్దరి మద్య వాగ్వాదం చివరికి గొడవకు దారి తీసింది. ఆగ్రహం చెందిన క్రిష్ణపాల్‌ జస్బిర్‌ను  అక్కడి కక్కడే పొడిచి చంపాడు. కుటుంబ సబ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారణ జరపగా పెగ్గు గొడవే హత్యకు కారణమని తేలింది. పోలీసులు క్రిష్ణపాల్‌ ను శుక్రవారం అదుపు లోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తానే మద్యం మత్తులో తాగిన మద్యం సరి పోక స్నేహితుడిని పెగ్గు పోయమని అడిగితే  తిరస్కరించడంతో హత్య చేశినట్లు ఒప్పుకున్నాడు. నిందితునిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు