ఆన్ లైన్ అప్పుల సెంటర్ల లో ఆరుగురు వ్యక్తుల అరెస్ట్

 22 మొబైల్ ఫోన్లు, 3 లాప్ టాపులు, 3 కంప్యూటర్లు, స్వాధీనం
దేశ వ్యాప్తంగా 70 వేల మంది భాదితులు


ఆన్లైన్ యాపులతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపించారు. ఈ యాపుల ద్వారా అప్పులు తీసుకుని వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడు తుండడంతో పోలీసులు యాపుల నిర్వాహకులను గుర్తించి దాడులు జరిపారు.  హైదరాబాద్ నగరంతో పాటు ఉత్తర బారత దేశంలో ఇలాంటి యాపులతో అప్పులు ఇస్తున్న సెంటర్లను గుర్తించే పనిలో  ఉన్నారు. 

హైదరాబాదో నగరంలో  ఆన్లైన్ ఇన్ స్టాంట్ రుణాలు ఇస్తున్న రెండు కంపెనీలను గుర్తించి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ తెలిపారు. మంగళవారం సిపి సజ్జనార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదు చేసామని చెప్పారు. ఆనియన్ క్రెడిట్ లిమిటె్, క్రెడ్ పాక్స్ టెక్నాలజి సంస్థలకు చెందిన  శరత్ చంద్ర అనే వ్యక్తితో పాటు మరో ఐదుగురిని అరెస్టే చేసామని తెలిపారు. వీరి బాంకు ఖాథాలలో ఉన్న 1.52 కోట్లు ఫ్రీజ్ చేసామని చెప్పారు. అంతే కాకుండా 22 మొబైల్ ఫోన్లు, 3 లాప్ టాపులు, 3 కంప్యూటర్లు, స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.రాయదుర్గలో నడుస్తున్న కంపెనీలో 110 మంది సిబ్బంది పనిచేస్తున్నారని వీరంతా కాల్ సెంటర్ కూడ నడిపిస్తున్నారని తెలిపారు. ఆన్ లైన్ అప్పులుతీసుకున్న వారితో తెలంగాణ ప్రాంతం నుండే కాక దేశ వ్యాప్తంగా ఉన్నారని సుమారు 70 వేల మంది భాదితులు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాలో తేలిందని అన్నారు.

ఆన్లైన్ అప్పుల యాపుల వ్యవహారం ఆర్ బిఐ దృష్టికి తీసుకు వెళ్లామని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా క్యాష్ మామా, లోన్‌ జోన్‌, ధనాధన్‌ పేర్లతో లోన్‌లు ఇస్తున్నారని 35 శాతం అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. లోన్కోసంయాపులు డౌన్ లోడ్ చేసుకున్న సమయంలో మొబైల్ కాంటాక్టు లిస్ట్ యాక్సెస్ ఇవ్వడంతో  ఆయా మొబైళ్ళలో ఉండే కాంటాక్టులు అన్ని ఆన్ లైన్ సెంటర్లకు చేరి పోతున్నాయని తెలిపారు.

హైదరాబాద్ నగరంలోని మూడు కమీషనరేట్ లపరిదిలో ఆన్ లైన్ యాపుల వలలో పడిన వందలాది మంది ఇప్పటికే ఫిర్యాదు చేసారు. గూగుల్ ప్లే స్టోర్ లో ్ందుబాటులో ఉన్న యాపులకు సంభందించి  పోలీసులు గూగుల్ కు నోటీసులు జారి చేశారు. ప్లేస్టోర్ లో ముందు యాపులు తొలగించాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు