బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా యువకుడి ఆత్మహత్యా యత్నం

 


హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టి కార్యాలయం ఎదుట ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించు కున్నాడు. యాచారం మండలం లోని తమ్మలాని గూడెం గ్రామానికి  చెందిన శ్రీనివాస్ అనే యువకుడు నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు.  కార్యాలయం ఎదుట యువకుడు మంటల్లో కాలిపోతుండగా అక్కడే ఉన్న బిజెపి కార్యకర్తలు, పోలీసులు నీళ్ళు పోసి మంటలార్పారు. ఆతర్వాత చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువకుడు 58 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సహా పలువురు నాయకులు శ్రీనివాస్ ను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం యశోదా ఆసుపత్రికి తరలించారు. 

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను కొద్ది రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని ఆ యువకుడు చెప్పాడు. సంజయ్ ను అరెస్ట్ చేసిన రోజు తాను  తీవ్రంగా కలత చెందానని అయితే జ్వరంతో ఉన్నందున బయటికి రాలేదని తెలిపారు. బండి సంజయ్ కోసం ఏమైనా చేస్తానని అన్నారు.

శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చాలా భాదాకరమని  బండి సంజయ్ అన్నారు. శ్రీనివాస్ చాలా కాలంగా బిజెపిలో కార్యకర్తగా పనిచేస్తున్నాడని తెలిపారు. రాష్ర్టంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రాక్షస క్రీడ ఆడుతున్నాడని బండి సంజయ్ మండి పడ్డారు. అడిగిన వారిని అరెస్ట్ చేసి జైళ్లకు పంపిస్తున్నాడని విమర్శించారు.  బిజెపి కార్యకర్తలు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ట్రంలో కాశాయ జెండా రెప రెపలాడేవరకు అందరూ ఆత్నస్థైర్యంతో పోరాడలని పిలుపు నిచ్చారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు