వరంగల్ సెంట్రల్ జైలు -లెఫ్టిస్టుల మెట్టినిల్లు


  • చారిత్రాత్మక  వరంగల్ సెంట్రల్ జైలు గురించి మీకేం తెల్సు ?

  • 135 ఏళ్ల చరిత్ర గల వరంగల్ సెంట్రల్ జైలు

                 


కాకతీయ సామ్రాజ్యంగా ఓరుగల్లుకు ఎంత చరిత్ర  ఉందొ, జైళ్ల రంగంలో దేశంలోనే వరంగల్ కేంద్ర కారాగారానికి అంత పేరుంది. వరంగల్ సెంట్రల్ జైలు జంపఖానా (కార్పెట్) లకు పెట్టింది పేరు. ఇక్కడి జైలు ఖైదీలు నేసిన జంపఖానాలు విదేశాశాలకు ఎగుమతి ఐయ్యేవి.  ఇండియాను సందర్శించడానికి వచ్చిన అనేక మంది విదేశీ చరిత్రకారులు తమ గ్రంధాల్లో ఈ కారాగారం గురించి శ్లాఘించడం విశేషం.  వరంగల్ ప్రధాన రహదారిలో ఎత్తైన గోడలతో కనిపించే  ఈ కారాగారం 135 ఏళ్ల క్రితం  నిర్మించింది. చర్లపల్లి జైలు అంత  పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండడం వల్లే ఇక్కడకి ఏంతో  మంది కరుడు గట్టిన నేరస్తులను ఉంచుతారు.  పోలీస్ యాక్షన్ తర్వాత తెలంగాణా ప్రాంతంలో జరిగిన గొడవల్లో అరెస్టయిన వారిని  ఒక్కొక్క  జైలులో  కెపాసిటీ కి మించి ఆరు రెట్ల మందిని ఉంచారు. వరంగల్ జైలులోనూ  రెండు వేల మందిని ఉంచారు. ప్రస్తుతం ఈ జైలులో  ఐ.ఎస్.ఐ.లాంటి కరుడు గట్టిన ఉగ్రవాద ఖైదీలను ఉంచుతున్నారు. 

             వరంగల్ జైలు కమ్యూనిస్టు తీవ్రవాదులను ఉంచే ప్రధాన కారాగారంగా కూడా పేరొందింది. ఈ జైలులో పీపుల్స్ వార్ ప్రస్తుత మావోయిస్టు తీవ్రవాదులను, జనశక్తి తీవ్రవాదులను విచారణ ఖైదీలుగా ఈ జైలులో పెద్ద సంఖ్యలో ఉండేవారు. అయితే, ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, 2010 వరకు పీపుల్స్ వార్, జనశక్తి తీవ్రవాదులకు ప్రత్యేక బారాక్స్ లను కేటాయించేవారట. వారి కిచెన్ లను వారే నిర్వహించుకునే వారట         

              ఖైదీలు కోర్టుకు వెళ్లకుండా ఇక్కడినుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఒకప్పుడు స్వాతంత్ర సమర యోధులతో, ప్రత్యేక తెలంగాణా ఉదయం కారులతో నిండిన ఈ జైలు బారాక్స్ ఇప్పుడు ఆదిలాబాద్, ఖమ్మం, కరీం నగర్, వరంగల్ జిల్లాలకు చెందిన నేరస్తులతో కిటకిట లాడుతోంది. 

                               వరంగల్ జైలు నిర్మాణానికి భాద్యులు హన్కిన్

    19 వ శతాబ్దం అంతం వరకు జైళ్ల పరిస్థితి అత్యంత దయనీయ పరిస్థితిలో ఉండేవి. నేరస్తులు, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆనాడు గోదాముల లాంటి గదుల్లో బంధించేవారు. సరైన మరుగుదొడ్లు, నీటి సదుపాయాలూ ఉండేవి కావు.అయితే, 1897  లో నిజాం ప్రభుత్వంలో హన్కిన్(Hankin )  అనే అధికారి జైళ్ల శాఖ అధిపతిగా భాద్యతలు చేపట్టిన తర్వాత నిజామ్ రాష్ట్రంలో జైళ్ల నిర్వహణలో గణనీయమైన మార్పులొచ్చాయి.అందులో భాగంగానే, 1885 లో వరంగల్ సెంట్రల్ జైలు (కేంద్ర కారాగారం ) నిర్మాణం జరిగింది. పది సంవత్సరాల క్రితం వరకు నాటి కట్టడ ప్రతిరూపంగా ఉన్న జైలు ముఖ ద్వారం స్థానంలో కొత్త ప్రవేశ ద్వారా నిర్మాణం జరిగినా లోపల మాత్రం గత నిర్మాణాలు యదావిధిగా కన్పిస్తాయి. నాటి నుండి నేటి వరకు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థతో పాటు పరిశుభ్రత, ఖైదీల్లో పరివర్తనకు మారుపేరుగా నిలిచిందీ కర్మాగారం. జైళ్ల ను దయనీయమైన పరిస్థితులనుండి దేశంలోనే అత్యంత ఉత్తమ ప్రమాణాలు కలిగిన పరివర్తనాలయాలుగా మార్చినందుకు హన్కిన్స్ కు నిజామ్ ప్రభుత్వం 1913 లో ప్రత్యేక పురస్కారం అందచేసింది.

       1922 లో మహబూబాబాద్, నర్సంపేట, జనగామ సబ్ జైళ్ల ఏర్పాటు


          19 శతాబ్దం మొదటి రెండు దశాబ్దాలలో జైళ్లు నేరారోపణలు ఎదుర్కొంటున్న వారితో (అండర్ ట్రయల్స్ ) తో నిండిపోయేవి. నేరం రుజువైన ఖైదీలకన్నా అండర్ ట్రయల్స్ ఈ జైళ్లలో అధికం కావడంతో 1922 లో  కార్యనిర్వాహక శాఖ నుండి జ్యుడీషియరీ వేరు కాగానే అనేక జిల్లాలో అండర్  ట్రయల్స్ లను ప్రత్యేకంగా ఉంచడానికి ప్రత్యేక లాకప్ లను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే జనగాం, మహబూబ్ బాద్, నర్సంపేట లలో జ్యుడిషియల్ లాకప్ లనే పేరుతొ ఏర్పాటు చేశారు. సబ్-జైళ్లుగా కూడా వ్యవహరించే వీటిలో రెండు సెల్స్ లను కలిగిఉంది ఒక్కోదానిలో అండర్ ట్రయల్స్, రిమాండ్ నేరస్తులు పది మంది పురుషులు, ఐదుగురు స్రీలు ఉండే విధంగా నిర్మించారు.

                                  13 హెక్టార్లలో వరంగల్ జైలు నిర్మాణం

    13 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సెంట్రల్ జైలులో 700 మంది ఖైదీలను ఉంచడానికి అవకాశముండగా గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి కూడా అండర్ ట్రయల్స్, నేరస్తులను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉంచేవారు. దీనితో సామర్ధ్య స్థాయికి మించిపోతుంది. విచారణ ఎదుర్కొనే ఉండరు ట్రయల్స్ కు ఇక్కడ ప్రత్యేక లాకప్ ఉండడం కూడా ఒక కారణం. ఈ జైలు నిర్వహణా అంటా ఇక్కడి సూపరింటెండెంట్ నేతృత్వంలో జరుగుతుంది.ఖైదీలకు వైద్య సదుపాయాలూ అందించడానికి ప్రత్యేక డిస్పెన్సరీ , విద్యావకాశాలు గాను ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ శిక్ష అనుభవిస్తూనే అనేక మంది ఖైదీలు పోస్ట్ గ్రాడ్యువేట్ కోర్సులను పూర్తిచేసుకున్న వారు కూడా ఉండడం విశేషం. దీనిలో బాస్కెట్బాల్, వాలి బాల్ తదితర క్రీడా సౌకర్యాలు కూడా ఉన్నాయి. గతంలో ఈ జైలు లోని ఖైదీలు, అండర్ ట్రయల్స్ రాసే రచనలు, కవితలు, కథలతో కూడిన సుధార్ అనే ఇంటర్నల్ మ్యాగజైన్ వెలువరించేవారు. పలు వ్యాదులనుండి బాధపడే ఖైదీలను ఐసోలేషన్ లో ఉంచడానికి ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. 

                             వరంగల్ జైలుపై రజాకార్ల దాడి

         1948 జనవరి 11 వ తేదీన సాయుధులైన రజాకార్లు వరంగల్ సెంట్రల్ జైలులోకి ప్రవేశించడానికి దాడి చేశారు. అయితే, అప్పుడు నిజాయితీపరుడైన జైలు సూపరింటెండెంట్ రజాకార్లను గేటు వద్దనే అడ్డుకున్నాడు.ఇదే రోజు సత్యాగ్రహాలు చేసిన వారిని నిర్బందించబడిన గుల్బర్గా, నిజామాబాద్, జైళ్ల మీదా కూడా రజాకార్లు క్రూరమైన దాడి చేశారు. ఈ సందర్బంగా నిజామాబాద్ జైలులో దాశరధి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆళ్వార్ స్వామితోపాటు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ రజాకార్లపై అప్పటి నిజామ్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.

                                     కాళోజి కూడా ఈ జైలు జీవితం గడిపారు

        1942 లో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం పిలుపునివ్వడంతో ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను కాళోజి, ఎం.ఎస్. రాజలింగం, కొమండూరి నారాయణ రావు ఈ జైలుకు వెళ్లారు.

                            వరంగల్ జైలు ఉత్పత్తులకు మంచి డిమాండ్

 ఇక్కడ నేసిన బర్రీలు, ఊలు కార్పెట్లు, దుప్పట్లు, బ్రాన్దేడ్ క్లాత్ లు, సబ్బులు, ఫర్నీచర్ తయారీ, ప్రింటింగ్ తదితర ఉత్పత్తులులను ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తారు. వీటి అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖైదీల సంక్షేమం కోసం వినియోగిస్తారు. ఈ జైలు పరిధిలో ఉన్న 15 ఎకరాల సువిశాల వ్యవసాయ భూమిలో కూరగాయలు, మొక్కజొన్న, మామిడి, చెట్లతో పాటుగా అనేక పూల మొక్కలను నేటికీ పెంచుతున్నారు. ఈ జైలు ఖైదీల ద్వారా పెట్రోల్ పంపులను కూడా నిర్వహిస్తున్నారు.  


                     


 కె.వెంకట రమణ, జాయింట్ డైరెక్టర్, సమాచార శాఖ. 9849905900

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు