విచక్షణతో ఆలోచించి ఓటేయాలి..ఎల్ బి స్టేడియం సభలో సిఎం కెసిఆర్

  • సవివర ప్రసంగం -అంశాల వారి ప్రస్తావనలు
  • మద్య మద్యలో విసుర్లు
  • మన పిల్లల భవిష్యత్ కోసం శాంతి సామరస్యాన్ని కాపుడుకుందామంటూ పిలుపు
  • బి -పాస్ కావాలా --- కర్ఫ్యూ పాస్ కావాలా ఆలోచించాలి
  • జిహెచ్ఎంసి ఎన్నికలు  మంచి సందేశం ఇవ్వాలన్నారు
  • నగరాభివృద్ధికి ఏటా 10 వేల కోట్ల  నిధులు 
  • బక్క కెసిఆర్ ను కొట్టేటందుకు ఇంత మందా
  • పక్క రాష్ట్ర పోళ్ల మాటలినొద్దు
  • మూసీని అందంగా తీర్చిదిద్దుతాం


ఎల్ బి స్టేడియంలో జరిగిన  జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన సహజ ప్రసంగ ధోరణికి కొంచెం భిన్నంగా సవివరణ ప్రసంగం చేసారు. రాజకీయ విమర్శలకే సమయం వృధా చేయకుండా ప్రభుత్వ పాలనా తీరును వివరించి నగర వాసులు విచక్షణతో ఆలోచించి ఓటేయాలని కోరారు.. 

తెలంగాణ ఉద్యమ నేపద్యం గుర్తు చేస్తూ తానెట్లా  14 సంవత్సరాలు పాటు సుదీర్ఘ కాలంగా పోరాడింది మొదలు రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణలో  చేపట్టి అమలు చేస్తున్న పథకాలను పూసగుచ్చినట్లు  వివరించారు.తన ప్రసంగంతో నగర వాసులను ఆలోచనలో పడేసి  వారిని తన వైపు తిప్పు కోవాలనే ప్రయత్నం కనిపించింది. పరుష పదజాలంతో ఆవేశపూరిత ప్రసంగానికి వెళ్లకుండా  జరిగిన అభివృద్ధి వివరించి అమలు అవుతున్న పథకాల జాబితా చదివి విచక్షణతో ఆలోచన చేసి   ఓట్లు వేయాలని పదే పదే విజ్ఞప్తి చేసారు.

హైదరాబాద్ లో కొనసాగుతున్న శాంతి సౌభ్రాతృత్వాలు కొనసాగేలా చూడాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. మన పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించి హైదరాబాద్ లో శాంతి సామరస్యం కాపాడాలన్నారు.

హైదరాబాద్ చైతన్యం, చరిత్ర ఉన్న నగరం..మంచి చెడులకు సాక్షి భూతం అంటూ ప్రసంగం ప్రారంభించారు.. తెలంగాణ రాష్ట్రం ఎట్లా సిద్ధించిందదో తానెట్లా అవమానాలు అనహేళనలు భరించి తెలంగాణా సాధించాడో చెప్పుకొచ్చారు. తెలంగాణ ఆరేళ్ల కాలంలో  దేశంలోనే అద్భుత విజయాలు సాధించిందన్నారు. కరెంట్ సమస్యను అధిగమించి దేశంలో జిలుగు వెలుగుల రాష్ట్రంగా తలసరి వినియోగంలో నంబర్ వన్ గా నిలిచిందన్నారు. నగరంలో ఎక్కడా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు లేకుండా నిరంతరాయం సరఫరా జరుగుతోందన్నారు. మిషన్ భగీరత కార్యక్రమం అనన్య సామాన్యమన్నారు.  నగరంలో నీటి ఎద్దటి లేదన్నారు. టాంకర్ల దగ్గర వీధి పోరాటాలు లేవన్నారు.  ప్రతి ఇంటికి నెలకు 25 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. అపార్ట్ మెంట్లలో ఉండే కుటుంబాలకు  కూడ ఉచిత మంచినీరు అంద చేస్తామన్నారు. ఆరేళ్ళలో భారత దేశంలో అందరూ ఆశ్చర్య పోయి అబ్బుర పడే రీతిలోరాష్ట్రం అభివృద్ధి సాదించిందన్నారు. సాగు నీటి ప్రాజెక్టులలో రాష్ట్రం దేశం లోనే రెండో స్థానంలో ఉందని త్వరలో మొదటి స్థానంలో ఉండబోతోందని అన్నారు.తెలంగాణ ధాన్య రాశులతో కళకళలాడుతోందన్నారు. 

నగరంలో వరదల విషయం ప్రస్తావిస్తూ దేశ వ్యాప్తంగా  ముంబై. మద్రాసు, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లి తదితర నగరాల్లో కూడ వరదలు వచ్చాయని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో చాలా చేయాల్సి ఉందన్నారు.  నగర దుస్థితికి గత పాలకులే కారమణని అన్నారు. అయినా ఎవరిని నిందించ దల్చుకోలేద్నారు.   హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రతి ఏటా బడ్జెట్ లో 10 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. శాశ్వత దీర్ఘకాలిక ప్రాతిపదిక పథకాలు చేపడతామన్నారు.

మూసి నదిని గోదావరి తో అనుసంధానం చేసి అందమైన నదిగా ఆవిష్కరిస్తామన్నారు.

వరద సాయం కోసం 1350 కోట్లు అడిగితే ప్రదాని 13 పైసలు కూడ ఇవ్వలేదన్నారు. దేశంలో అన్ని మహా నగరాలకు కూడ సహాయం చేయాని అడిగితే ఎక్కడా చేయలేదు...ఇక్కడకు వచ్చి ఈ నా కొడుకువలు కిరి కిరి పెడుతున్నారంటూ విమర్శించారు. అయినా వరద సాయంగా నగరంలో 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసామని అన్నారు. నగరంలో 650 కోట్లు పంపణి చేసామని మరో 150 కోట్లు  అయినా 250 కోట్లు అయినా ఇస్తామని డిసెంబర్ 7 నుండి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి పంపిణి చేపడతా మని తెలిపారు. వరదల సమయంలో మంత్రులు మోకాళ్ళలోతు నీళ్ళ లో తిరిగారు...బియ్యం, పప్పులు, ఉప్పులు అన్ని తడిసి పోయాయి అవన్ని  చూస్తే దుఖ్ఖం వచ్చిందన్నారు.

బక్క కెసిఆర్ ను కొట్టేటందుకు ఇంత మందా..సిఆర్ ను చూసి గజ గజ వణుకుతున్నరు.. కెసిఆర్ కు .ఫ్రంట్ ఎక్కడిదంటున్నరు..ఎక్కడ డిల్లీకి వస్తడో అని  భయపడుతున్నరు..ఈ దేశాన్ని రెండు జాతీయ పార్టీలు ఈ గతి పట్టించాయి..ఈ దేశం గతి మార్చాలే..అందుకు జిహెచ్ ఎంసి ఎన్నికలతో ప్రజలు మంచి సందేశం ఇవ్వాలే అని అన్నారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. ఎల్ఐసి, బిహెచ్ఇఎల్, రైల్వేలను ప్రైవేట్ పరం చేయాబోతోందని విమర్శించారు.

హైదరాబాద్ కు లక్షల సంఖ్యలో పెట్టుబడులు వస్తున్నాయి.. శాంతి సామరస్యంతో నగరం గుల్ దస్తాగా ఉండాలి..పక్క రాష్ట్ర పోడు వచ్చి ఏదో చెప్తడు...వాంది నెత్తా...కత్తా... మంది మాటలు విని మార్వానం పోతే మళ్ల వచ్చే వరకు ఇళ్లు కాలి నట్లు కాకుండా పక్కరాష్ట్ర పోళ్ల మాటలు వినవద్దు... వాళ్ళు ఇవ్వాల ఉంటరు రేపు పోతరు.. మనం ఇక్కడే ఉంటాం..మంత్రులు ఇక్కడే ఉంటరు..నేను ఇక్కడే ఉంటా.. మహారాష్ట్ర ఉత్తర ప్రదేశ్ వాళ్ల మాటలు వినవద్దు.. రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసుకుందాం మనకు బి పాస్ కావాలా...కర్ఫ్యూ పాస్ కావాలా ఆలోచించాలన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు