ధరణి పోర్టల్ లో అస్తుల నమోదుపై స్టే విధించిన హై కోర్టు

 ప్రజల ఆస్తుల వివరాల నమోదుకు భద్రత చర్యలేమిటో తెలపాలన్న కోర్టు
కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల  గడువు ఇచ్చిన కోర్టుధరణి పోర్టల్  లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై  హై కోర్టు స్టే విధించింది. పోర్టల్ లో భద్రతా పరమైన సాంకేతిక జాగ్రత్తలు పాటించకుండా వ్యవసాయేతిర ఆస్తుల  నమోదు ప్రమాదకరమని అభ్యంతరం వ్యక్తి చేస్తు దాఖలైన మూడు పిటీషన్లపై కోర్టు మంగళవారం విచారించింది.  ధరణి ప్లే  స్టోరుకు సంబందించిన ఆప్స్ గూగుల్ ప్లేస్టోర్ లో  మరో నాలుగు ఉన్నాయని ఏది అసలైన ఆపో నిర్దారించుకోవడంలో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారన్న పిటీషనర్లు వాదనను హై కోర్టు సమర్దించింది.  వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంభందించి ప్రభుత్వం తీసుకున్న భద్రతా చర్యలు ఏమిటో తెలపాలని హై కోర్టు ఆదేశించింది.  రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అప్పటివరకు వివరాల నమోదు చేసేకార్యక్రమం నిలిపి వేయాలని సూచన చేసింది.  వివరాల నమోదు విషయంలో  ప్రజలను బలవంత పెట్టరాని హై కోర్టు తెలిపింది.  ఈ పిటిషన్ల పై తదుపరి విచారణను ఈ నెల 20 కి వాయిదా వేసింది.

రెవెన్యూ చట్టాల ప్రక్షాళన పేరిట తెలంగాణ సర్కార్ ఆఘ మేఘాల మీద  ధరణి పోర్టల్ కోసం అంటూ చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల నమోదు  కార్యక్రమం ప్కజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది.  గ్రామ పంచాయితి మున్సి పాల్టీలలో పూర్తిగా వ్యవసాయేతర ఆస్తుల ఉన్నప్పటికి తిరిగి మళ్ళి తమ ఇండ్ల ముందు యజమానుల ఫోటోలు తీసుకుని ఆధార్ నెంబర్ తో సహా  ఇంటి కొలతలు తీసుకుని వివరాలునమోదు చేశారు.  వివరాలు నమోదు చేసే  సిబ్బందితో పాటు సామాన్య ప్రజలు కూడ ఇ్బబందులు పడ్డారు. కరోనా కట్టడిలో ఈ ఆస్తుల నమోదు ఏంటంటూ సిబబంది కూడ అసహనానికి గురయ్యారు.  అయినా ప్రబుత్వం ఇవేవి పట్టించు కోకుండా ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందిని కూడ ఆస్తుల నమోదు కార్యక్రమంలో  ినియోగించింది. ఆయినా నూటికి నూరు శాతం వివరాలు నమోదు కాలేదు. ఎట్టి పరిస్థితిలో దసరా పండగ రోజు ధరణి పోర్టల్  ప్రారంభం కావాలని పటటుబట్టిన  సిఎం కెసిఆర్ వీలు కాక పోవడంతో  ప్రారంభోత్సవం వాయిదా వేయాల్సి వచ్చింది.  అక్టోబర్ 29 వ తేదీన రంగారెడ్డి జిల్లా 

మూడు చింతలపల్లిలో  సిఎం కెసిఆర్ ధరణి పోర్చల్ ప్రారంభించారు. 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు