కాలుష్యం లేని చోట పటాకులు కాల్చేందుకు సుప్రీం కోర్టు అనుమతులు

 


తెలంగాణ లో పటాకుల నిషేధంపై  సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు నల్గొండ, పటాన్ చెరువు, సంగారెడ్డి మినహా ఇతర జిల్లాలలో పటాకులు కాల్చేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం  మధ్యంతర ఉత్తర్వులు జారి చేసింది. వాయి కాలుష్యం తీవ్రత అధికంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో పటాకులు  కాల్చవచ్చు. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలలో పటాకులు కాల్చు కోవచ్చు. రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పటాకులు కాల్చాలి.

వాయు కాలుష్యం దృష్టిలో పెట్టుకుని పటాకులు కాల్చడంపై ఆంక్షలు  తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జారి చేసిన ఉత్తర్వులు సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో లంచ్  మోషన్ పటీషన్ దాఖలు చేసారు. అయితే  కొన్ని శరతులు విధిస్తూ  సుప్రీం కోర్టు హై కోర్టు ఉత్తర్వులను సవరిచింది.  క్రాకర్స్ అసోసియోషన్ అధ్వర్యంలో ఈ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపి మద్యంతర ఉత్తర్వులు జారి చేసింది. కోట్లాది రూపాయల పటాకులు ఖరీదు చేసి నిల్వ చేసామని  నిషేదం విధించడం వల్ల తీవ్రంగా నష్ట పోతామని తమకు ఆత్మహత్యలే శరణ్యమని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేసారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు లోబడి హై కోర్టు ఆదేశాలు ఉండాలని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. శబ్ద కాలుష్యం అధికంగా ఉన్న పటాకులు కాకుండా గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. ఈ కేసులో ప్రతి వాదులకు నోటీసులు జారి చేసిన సుప్రీం కోర్టు కేసును ఈ నెల 16 కు వాయిదా వేసింది. కరోనా తో పాటు నగరాల్లో వాయు కాలుష్యం నేపద్యంలో పటాకులు నిషేదించాలని కోరుతూ హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన పి. ఇంద్రప్రకాష్ అనే న్యాయ వాది ఈ నెల 9 న హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేయడంతో హైకోర్టు నిషేధం విధించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు