ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నిక చెల్లదంటూ ఓ మాజి సైనికుడు సవాల్ చేసిన కేసు - తీర్పు రిజర్వు చేసిన సుప్రీం


 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పెద్ద చిక్కే వచ్చి పడింది.తేజ్ బహదూర్ యాదవ్ పేరు మీరెప్పుడైనా విని ఉన్నారా?! వినే ఉంటారులే! దేశ సరిహద్దుల్లో పహారా కాసిన సైనికుడు. ఆ మధ్య వార్తల్లో నిలిచారు. సైనికులకు ఎలాంటి ఆహారం అంద చేస్తున్నారో చెప్పి మొబైల్ ఫోన్లో దేశ ప్రజలకు తెలియచెప్పినందుకు అతన్ని క్రమ శిక్షణ చర్యల కింద డిస్మిస్ చేసారు.  అతని వల్లే ప్రధాన మంత్రి ప్రస్తుతం ఓ న్యాయ పరమైన వివాదంలో ఇరుక్కు పోయాడు. నరేంద్ర మోదీ గత 2019 ఎన్నికల్లో వారణాసి లోక్ సభ స్థానం నుండి పోటి చేసి గెలిచారు. ఈ గెలుపును సవాల్ చేస్తూ తేజ్ బహదూర్ న్యాయ పోరాటం చేస్తున్నాడు. 

నరేంద్ర మోది వారనాసి లోక్ సభ నియోజకవర్గం ఓటరు కాదని అందుకు ఆక్కడి నుండి పోటి చేసే అర్హత కూడ లేదని ఆయన ఎన్నిక చెల్ల నేరదంటూ బహదూర్ సింగ్ యాదవ్ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాడు.  ఇరు వర్గాల వాదనలు ఆలకించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. 

తేజ్ బహదూర్ యాదవ్ నరేంద్ర మోది పై పోటి చేసేందుకు సమాజ్ వాది పార్టి అభ్యర్థిగా నామినేషన్ వేసాడు. కాని తేజ్ బహదూర్ ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గ ఓటరు కాదని, ఎన్నికల కమిషన్‌కు తేజ్ బహదూర్ తప్పుడు సమాచారం ఇచ్చాడని ఎన్నికల అధికారి నామినేషన్ తిరస్కరించాడు. దాంతో బహదూర్ యాదవ్  లక్నో హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు చుక్కెదురైంది. వారణాసి నియోజకవర్గంలో బహదూర్ ఓటరు కాదు.. మోదీపై ఆయన పోటీ కూడా చేయలేదు''అని చెబుతూ ఆయన దాఖలుచేసిన అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఫలితంగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనను వారనాసి ఓటరు కాదంటూ నామినేషన్ తిరస్కరించారని కాని నరేంద్ర మోది కూడ వారనాసి నియోజక వర్గం ఓటరు కాదని కనకు ఆయన ఎన్నికల చెల్లనేరదంటూ బహదూర్ తరపు న్యాయ వాది సుప్రీం కోర్టులో వాదించారు.

 ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు ఆలకించిన ప్రధాన న్యాయమూర్తి బాబ్డే సారథ్యం లోని జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్ల తో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ కేసు విషయంలో ధర్మాసనం చెప్పబోయే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెల కొంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు