నగరంలో పట్టు బడిన కోటి రూపాయలు - రఘునందనరావు బామ్మర్ది అరెస్ట్

 పట్టుబడిన సొమ్ము దుబ్బాక అభ్యర్థి రుఘునంద రావు బామ్మర్దిదన్న పోలీసీలు
విశాఖ ఇండస్ట్రీ నుండి దుబ్బాకకు డబ్బు తరలిస్తున్నారన్నారు


హైదరాబాద్ నగరంలో  ఆదివారం మద్యాహ్నం పోలీసులు ఇన్నోవా కారులో తరలిస్తున్న కోటి రూపాయలకు పైగా నగదును బేగం పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర స్వాదీనం చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఇసందర్బంగా కారు డ్రైవర్ రవి తో పాటు దుబ్బాకలో పోటి చేస్తున్న బిజెపి అభ్యర్తి రఘునందనరావు బామ్మర్ది సురభి శ్రీనివాస రావును అరెస్ట్ చేశామని చెప్పారు.

డబ్బు దుబ్బాక ఎన్నికల కోసం తరలిస్తున్నట్లు తమ విచారణలో నిర్దారణ ఆయిందని ఆయన తెలిపారు. ఈ డబ్బును హవాలా మార్గంలో విశాఖ ఇండస్ట్రీ నుండి దుబ్బాకు వెళుతున్నట్లు గుర్తించామని చెప్పారు. కారు తో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని విచారించగా పూర్తి వివరాలు తెలిసాయని తెలిపారు. రుఘనందన రావు బావమర్ది శ్రీనివాస రావు కాల్ రికార్డు పరిశీలించగా ఆయన రఘునందనరావుతో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయని తెలిపారు ఇంక అనేక కీలక ఆధారాలు గుర్తించామని చెప్పారు.. ఈ నెల 3 వతేదీన జరగనున్న ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపేందుకు పోలీసులు కృత నిశ్చయంతో ఉ్ననారని అన్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు