ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని ట్రాన్స్ జెండర్లకు సిఐ కౌన్సిలింగ్

 ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు
ఇంతేజార్ గంజ్ ఇన్స్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు 


రహదారులు, ముఖ్యకూడళ్ల దగ్గర ప్రజలను ఇబ్బందులు పెడితే ఖఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఇంతెజార్ గంజ్ సిఐ వెంకటేశ్వర్లు ట్రాన్స్ జెండర్లను హెచ్చరించారు.

  వరంగల్  నగరంలో  ట్రాన్స్ జెండర్ల ద్వారా ఎదురవుతున్న సమస్యలకు సంబంధించి పోలీసులకు పలు ఫిర్యాదులు రావడంతో వరంగల్ ఏసీపి గిరికుమార్ ఆదేశాల మేరకు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆదివారం వారికి  పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు.

 వరంగల్ నగరంలోని ప్రధాన ట్రాన్స్ జెండర్ల గ్రూపులకు చెందిన ట్రాన్స్ జెండర్లు  ప్రధాన కూడళ్ళులో అగివున్న వాహనదారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా డబ్బులు అడగడంతో ఇబ్బందులు తలెత్తు తున్నాయని అన్నారు. సిగ్నలింగ్ కూడళ్లు, రైల్వే స్టేషన్లు , బస్టాండ్ ల వద్ద ప్రయాణికులతో పాటు యువకులతో కొందరు ట్రాన్స్ జెండర్లు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు డబ్బులు ఇవ్వని వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లుగా పలు ఫిర్యాదు అందాయన్నారు.  ఇకపై ట్రాన్స్ జెండర్లుప్రజల పట్ల గౌరవ మర్యాదలతో వ్యహరించాల్సి వుంటుందని. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలత్తే విధంగా సిగ్నలింగ్ కూడళ్ళలో డబ్బులు అడగడం  చేయవద్దని సూచించారు. ఇక మీదట ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినట్రాన్స్ జెండర్ల పైచట్టపరమైన చర్యలు తీసుకుంటామని  ఇన్స్‌పెక్టర్  హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు