బిగ్ బి అమితాబ్ పై హిందూ వాదుల కోపం ఎందుకు? కేసులు ఎందుకు నమోదు చేసారు?

 


1927 డిసెంబర్ 25 న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ఆయన మద్దతు దారులు ఏ గ్రంధం ప్రతులు కాల్చి  వేశారు? 

ఎ- విష్ణుపురాణం బి-  భగవత్  గీత సి-రుగ్వేదం, డి- మనుస్మృతి 


బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్టుగా ప్రసారం అయ్యే కౌన్ బనేగా కరోడ్ పతి పై లక్నోలో పోలీసులు కేసు నమోదు చేసారు. శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో హిందువులు మనోభావాలు దెబ్బతినే లా అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలు ఉన్నాయని హిందూ అక్టివిస్టులు కొందరు  లక్నోలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మరో వైపు మహారాష్ట్ర బిజేపి ఎమ్మెల్యే అభిమన్యు పవార్ కూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  కేసునమోదు చేసారు. కౌన్ బనేగా కరోడ్ పతి 12 వ సీజన్  ప్రసార కర్తలపైనా షో హోస్ట్ బిగ్ బి పైనా కేసులు నమోదు అయ్యాయి. 

అంతటితో అగకుండా దేశ వ్యాప్తంగా హిందు అక్టివిస్టులకు సంభందించిన పలు సంస్థలు దేశ  వ్యాప్తంగా దీన్ని పెద్ద ఇష్యు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని మీడియా వార్తలను బట్టి అర్దం అవుతోంది.

ఇంతకి సోని టివి యాజమాన్యం ప్రసారం చేసిన ఎపిసోడ్ లో అడిగిన ప్రశ్నలు ఏమిటంటే రాజ్యాంగ నిర్మాతల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  మనుధర్మ శాస్ర్తం తగలబెట్టిన ప్రశ్న. అదే వారికి ఆగ్రహం కలుగ చేసిందట. 

1927 డిసెంబర్ 25 న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ఆయన మద్దతు దారులు ఏ గ్రంధం ప్రతులు కాల్చి  వేశారు?  ఇది ఆ ఎపిసోడ్   కరమ్‌వీర్ స్పెషల్  లో అమితాబ్ బచ్చన్  అడిగిన ప్రశ్న.  ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు  అడిగారు. ఎ- విష్ణుపురాణం బి-  భగవత్  గీత సి-రుగ్వేదం, డి మనుస్మృతి. సామాజికవేత్త బెజ్వాడ విల్సన్, నటుడు అనూప్ సోనిని ఉద్దేశించిన 6.40 లక్షల రూపాయల ప్రశ్నగా అమితాబ్ ప్రశ్నించారు. ఈ ప్రశ్న హిందూ వాదులకు ఆగ్రహం కలుగు చేసిందట.  హిందువుల మనోభావాలు దెబ్బ తీసేందుకే  ఇలా అన్ని హిందువుల మత గ్రంధాలను ఉటంకిస్తు ప్రశ్నలు అడిగారని వారి అభ్యంతరం.  ఇలాంటి ప్రశ్నల ద్వారా బిందువుల మత గ్రంధాలను దగ్దం చేయవచ్చన్న తప్పుడుసంకేతాలు ఇచ్చేలా షో ప్రసారం ఉందని వారు ఫిర్యాదు పేర్కొన్నారు.  కౌన్ బనేగా కరోడ్ పతి  ప్రసారాలు పూర్తిగా లెఫ్ట్ ఐడియాలజీ భావ వ్యాప్తి కలుగు చేసేవిధంగా ఉన్నాయని వారి వాదన.  అమితాబ్ బచ్చన్ పై సోషల్ మీడియాలో  హిందు అక్టివిస్టులు మండిపడ్డారు. కావాలనే ఖచ్చితంగా హిందువుల మనోభావాలపై దేడి చేస్తున్నారని హిందూ మతం నుండి భౌద్ధాన్ని వేరు చేసే కుట్ర జరుగుతోందని ఫిర్యాదు దారులు మండి పడ్డారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు