ఛార్జ్‌షీట్ -‌ టిఆర్ ఎస్ వైఫల్యాలు ఎండగట్టిన బిజెపి


 జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి వైపల్యాలను ఎండ గడుతూ బారతీయ జనతా పార్టి 26 పేజీలతో కూడిన చార్జి షీటును విడుదల చేసింది. రంగుల పోటోలతో ముద్రించిన  బ్రోచర్ లో  అనేక అంళాలలో వైపల్యాలు ఎత్తి చూపింది. ఆరు సంవత్సరాల్లో 60 వైఫల్యాలు అంటూ  చార్జ్ షీటులో పలు అంశాలను ఎత్తి చూపారు.

ఆదివారం నగరంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ఈ చార్జి షీటు విడుదల చేసారు. ఈసందర్బంగా ఆయన తన ప్రసంగంలో ఎంఐఎం, టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు.  కెసిఆర్, ఓవైసి కుటుంబ పాలన నుండి నగరాన్ని కాపాడు కోవాలని ఆయన అన్నారు. కెసిఆర్ ఆయన కుమారుడు కెటిఆర్ ఇద్దరూ ఎంఐఎం  పార్టి నేత అసదుద్దీన్ కోసం రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజ మెత్తాడు. కెసిఆర్ ఆరేళ్ల పాలన మొత్తం అవినీతి మయమని అన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఓ వైపు పెరుగి  పోతుంటే పేద ప్రజలఆస్తులు మరో వైపు తరిగి పోతున్నాయన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ పాలాతీరు సరిగా లేదన్నారు. కరోనావచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కెసిఆర్ ఫాం హవుజ్ లో పడుకున్నాడని విమర్శించాడు. నరేంద్ర మోది ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారతి అమలు చేసి ఉంటే కరోనా సోకిన నిరుపేదలకు ఉచితంగా చికిత్స లభించేదని అన్నారు.  మూసి నది ప్రక్షాళన చేసి కొబ్బిరి నీళ్ళుగా మారుస్తామని చెప్పిన కెసిఆర్ ఆ నీళ్ళు తాగుతారా అంటూ ప్రశ్నించారు.  నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తామని ఫ్లడ్ సిటీగా మార్చారు. ఓ డ్రైనేజి సౌకర్యం కూడ సరిగ్గా లేదు. నగరం 18 రోజులపాటు వరద నీటిలో ఉంది.  లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని   ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. లక్ష రెండు గదుల ఇండ్లు నిర్మిస్తామని రెండు వందలు కూడ నిర్మించ లేదు. ప్రధానమంత్రి దేశ వ్యాప్తంగా రెండున్నర కోట్ల ఇండ్లు నిర్మించారన్నారు. బిజెపి మేయర్ కావాలో ఎంఐఎం మేయర్ కావాలో  నగర ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.  

కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బిజెపి బిసి సెల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, ఎంపి  దర్మపురి అరవింద్, డి.కె అరుణ, మాజి ఎంపి వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు