తలుచుకుంటే రెండునెలల్లో టిఆర్ఎస్ సర్కార్ ను కూల్చేయగలం..ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్

 తలుచుకుంటే రెండునెలల్లో  టిఆర్ఎస్ సర్కార్ ను కూల్చేయగలం.. చార్మినార్ ఎంఐఎం పార్టి ఎమ్మెల్యే  ముంతాజ్ ఖాన్
కెటిఆర్ నిన్నమొన్న వచ్చిన చిలక  ఇలాంటి వారిని చాలా మందిని ఎంఐఎం చూసిందిజిహెచ్ఎంసి ఎన్నికల్లో  పార్టి ప్రచారం వెడెక్కిన క్రమంలో ఎంఐఎం పార్టి ఎమ్మెల్యే  ఒకరు టిఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. చార్మినార్ నియోజకర్గం ఎమ్మెల్యే  ముంతాజ్ ఖాన్  అదివారం మీడయాతో మాట్లాడుతూ  తమ పార్టి తలుచుకుంటే టిఆర్ఎస్ పార్టిసర్కార్ ను రెండు నెలల్లో కూల్చేయ గలదని అన్నారు.  ఎంఐఎం పార్టి చాలా మందిని చూసిందని  తమ పార్టి నేత చెప్పినట్లు రాజకీయం తమ ఇంటి నౌకరుతో సమానమని అన్నారు. ఇక జిహెచ్ఎం సి ఎన్నికల్లో  మేయర్ పీఠం ఎంఐఎంకు  ఇచ్చేది లేదని ప్రకటించిన  మంత్రి కెటిఆర్ పై ఎంఐఎం ఎమ్మెల్యే సెటైర్ వేశారు.  కెటిఆర్  ఓచిలకంటూ సెటైర్ వేశారు  'ఆయన నిన్న మొన్నకండ్లు తెరిచాడు..ఇలాంటి వారిని చాలా మందిని చూశాం..' అని అన్నారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎంఐఎం కు ఓటు వేసినట్లే నని  బిజపి  ప్రచారం చేస్తుంటే మరో వైపు ఎంఐఎం, బిజెపి పార్టీలు తమ మద్య పొత్తులు లేవని ప్రకటించాయి.  ఇక మేయర్  పదవిని ఎంఐఎం కు ఇవ్వబోమంటూ టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్  ప్రకటించారు. అయితే పాత బస్తీలో  అన్ని స్థానాలకు కాకుండా  టిఆర్ఎస్ కొన్ని స్థానాలకు మాత్రమే పోటి పడుతోంది.  రెండు పార్టీల మద్య  ఏదో జరుగుతుందని ఎంఐఎం ఎమ్మెల్యే  చేసిన వ్యాఖ్యను బట్టి అంచానాకు రావడం కష్టం. ఎందుకంటే ఎంఐఎం తీరే  అంత. పాత బస్తీ ఇలాఖాలో  తాము తప్ప ఇంకా వేరెవరూ దూర  లేరని అహంకారం. ఎన్నికల సమయంలో ఒకరు కొట్టినట్లు చేస్తే మరొకరు ఏడ్చి నట్లు చేయడం సహజం. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత తిరిగి ఎవరి స్ట్రాటజి వారికి ఉంటుంది.

ముంతాజ్ ఖాన్ ఎంఐఎం పార్టీలో చాలాసీనియర్ నేత. ఆయన గతంలో ఐదు సార్లుయాకూత్ పుర నియోజకవరగం నుండి వరుసగా ఎంపికయ్యారు. 2018 ఎన్నికల్లో చార్మినార్ నియోజకవర్గం స్థానం నుండి గెలిచారు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు