మహాత్మ గాంధి ముని మనువడు సతీష్ ధూపేలియా కరోనాతో మృతి

 


దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో మహాత్మ గాంధి ముని మనువడు సతీశ్‌ ధూపేలియా (66) కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించాడు. కొద్ది రోజుల క్రితమే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సతీష్ అకస్మాత్తుగా న్యుమోనియా సోకి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు.  చికిత్స జరిగి నయం అయిన తర్వాత ఆయనకు కరోనా సాకినట్లు ఆయన సోదరి ఉమా ధూపేలియా మెస్త్రీ  మీడియాకు తెలిపారు. సతీశ్‌ ధూపేలియా, ఉమా ధూపేలియా, కీర్తిమీనన్‌ మనీలాల్‌ మహాత్మి గాంధి రెండో కుమారుడు మనీలాల్ గాంధీ వారసులు. మహాత్మ గాంధి దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో ఆయన నిర్వహించిన కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా కొన సాగిస్తున్నారు.

గాంధి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళడంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తిగా సతీష్ ధూపేలియాకు మంచి పేరుంది. ఆయన తనకు ఇష్టమైన మీడియా ఫీల్డులో చాలా కాలం పనిచేసారు. వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్‌గా కొనసాగారు. డర్బన్‌ సమీపంలోని ఫీనిక్స్‌ సెటిల్మెంట్‌ వద్ద మహాత్ముడు ప్రారంభించిన పనులను కొనసాగించేందుకు గాంధీ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌కు సంపూర్ణ సహాయ సహకారాలు అందించి క్రియాశీలకంగా పనిచేసారు.

రాజకీయ విశ్లేషకులు లుబ్నా నద్వి సతీష్ ధూపేలియా గురించి మాట్లాడుతు ఆయన గొప్ప మానవతా వాది అని పేర్కొన్నారు. ఎక్కువగా మహిళల హక్కులు ప్రయ్జోజనాల పరిరక్షణ కోసం కృషి చేసారన్నారు. ఆయనను సంప్రదించిన ప్రతి ఒక్క సంస్థకు ఏదో విదంగా తోడ్పడే వాడని అన్నారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు