ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్పేర్ అసోసియేషన్ ఏర్పాటు

బషీర్ భాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మొదటి సమావేశం


ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు  ఆంధ్ర ప్రభ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్  అసోసియేషన్  ఏర్పాటైంది. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  జరిగిన ఇండియన్ అకెస్ ప్రెస్ గ్రూపు రిటైర్డ్ ఎంప్లాయీస్  సమావేశంలో  కమిటీని ఎన్నుకున్నారు. 

సమాచార శాఖ మాజి కమీషనర్ పి విజయ బాబు గౌరవ అద్యక్షతన  జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.  ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్పేర్  అసోసియేషన్  ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో  కన్వీనర్ ఈశ్వర్ పిళ్లే వివరించారు. రిటైర్డ్  ఉద్యోగుల  యోగ క్షేమాలను కాంక్షిస్తు ఏర్పాటు చేసిన యూనియన్  సంక్షేమ కార్యక్రమాలపట్ల సంపూర్ణ సేవా భావంతో పనిచేస్తుందని తెలిపారు. 

సమావేశంనాకి అధ్యక్షత వహించిన విజయబాబు మాట్లాడుతూ  ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు రిటైర్డ్ ఉద్యోగులు వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం ఆహ్వానించ దగ్గ పరిణామమని అన్నారు.  సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో  అసోసియేషన్  కు సార్దకత చేకూరాలని అన్నారు. 

నూతన కార్యవర్గం

నూతన కమిటి అధ్యక్షులుగా  పిఆర్ కె ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా  కె.వెంకటరత్నం లను సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  మిగత కార్యవర్గ సబ్యులను ఏర్పాటు చేసే భాద్యతను అధ్యక్ష కార్యదర్శలకు అప్పగించారు. 

సమావేశంలో  ఐజెయు నాయకుడు బై. నరేందర్ రెడ్డి, ఎన్. జగన్నాధ్ దాస్, జి రాజసుఖ, ,ఆర్ వి కోటేశ్వర్ రావు, బాలకృష్ణ, ఎం పల్లం రాజు, కె సంపత్ కుమార్, కిసోర్ బాబు, విజికె మూర్తి, కె నర్సింహా రెడ్డి, జిఎన్ రాజేందర్, డి సుబ్రమణ్యం, కె రాఘవ రావు, ఎన్ రాజశేఖర్, పాపారావు (ఒంగోలు), హిదాయత్ అలి  తదితరులు పాల్గొన్నారు.

 అసోసియేషన్ లో  60 కి పైగా సబ్యులు సభ్యత్వం పొందారని  ఇంకా చేరని వారిని కూడ కలుపుకుంటామని నిర్వాహకులు తెలిపారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు