కెసిఆర్ సచివాలయానికి వెళితే గదా కేంద్రం నిధుల గురించి తెల్సేది..హోం మంత్రి అమిత్ షా


కేంద్రం నిధులు ఇవ్వడం లేదని తెలంగాణ సిఎం కెసిఆర్ పదే పదే చేస్తున్న విమర్శలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యంగ్యాత్మకంగా తిప్పి కొట్టారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం అనేక నిధులు ఇస్తోంది.. వరదలు వచ్చి నపుడు రెండు విడతలుగా 500 కోట్లు ఇచ్చాం..కెసిఆర్ ఎప్పుడైనా సచివాలయానికి వెళితే కదా కేంద్రం నిధులు గురించి తెల్సేదంటూ అమిత్ షా విమర్శించారు. పేదల ఇండ్ల నిర్మాణం పథకం కింది కేంద్ర ప్రతి ఏటా 2 వేల కోట్లు ఇస్తోందన్నారు. ప్రధాన మంత్రికి పేరు వస్తుందనే తెలంగాణలో కెసిఆర్ స్వాస్త్ యోజనపథకాన్ని అమలు చేయడం లేదని అన్నారు. అట్లాగే ఆయుష్మాన్ భారత్ ఫలాలు కూడ అంద కుుంాడ చేసారని విమర్శించారు. 

అదివారం నగరంలో వారాసి గూడ నుండి సీతాఫల్ మండి వరకు  రోడ్ షోలో పాల్గొన్న అమిత్ షా అనంతరం పార్టి కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

తనకు స్వాగతం పలికిన నగర వాసులను చూస్తుంటే మేయర్ పదవి భాజపాదే అని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూస్తేనే మా విజయం ఖాయమని తెలుస్తుంది. నేను ఎన్నికల కోసం వచ్చాను.. కేసీఆర్‌ను కొట్టడానికి కాదు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో వందేళ్లు బతకాలి. అధికారం ఇస్తే హైదరాబాద్‌ను ప్రపంచానికే ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం.కేంద్రం ద్వారా హైదరాబాద్‌ చిరువ్యాపారులకు అత్యధికంగా లాభం జరిగింది.నవాబు, నిజాం సంస్కృతుల నుంచి విముక్తి చేసి..హైదరాబాద్‌ ఒక మినీ ఇండియాగా తీర్చిదిద్దుతాం’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. 

ఎంఐఎం టిఆర్ఎస్ తెర వెనక పొత్తులపై అమిత్ షా విమర్శలు చేసారు. తెర వెనుక ఎందుకు పొత్తులు పెట్టు కోవాలి..ఎవరు ఎవరితో అయినా కల్సి పోటి చేయవచ్చు ఎందుకు చాటు మాటు వ్యవహారం అంటూ ప్రశ్నించారు.  ఇవి గల్లి ఎన్నికలు అనే వారు గల్లీలను ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు.

వరదలు వచ్చినపుడు కెసిఆర్ ఎక్కడున్నాడు ఎంఐఎం నేత ఎక్కడున్నారని ప్రశ్నించాడు. ప్రజలు కష్టాలలో ఉన్నపుడు ఎందుకు రాలేదని అన్నారు. హైదరాబాద్ మిని భారత్ అని ఇక్కడి అన్ని ప్రాంతాల వారు అన్ని మతాలు వారు ఉంటారని  మేకిన్ ఇండియా ఫలాలు  హైదరాబాద్ లో కనిపిస్తున్నాయని  భవిష్యత్ ఐటి రంగంలో హైదరాబాద్ మరింత అభివృద్ధి అయ్యేందుకు తోడ్పడతామని అన్నారు.


కాశాయ మయం అయిన బస్తీ

అమిత్ షా పర్యటన సందర్బంగా ఆయన రోడ్ షో అంతా కాశాయ మయం అయింది. భారి సంఖ్యలో అమిత్ ష్ రోడ్ షోలో జనం పాల్గొన్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు పార్టి అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాపలువుర బిజెపి నేతలు స్వాగతం పలికారు. అనంతరం అయన  పాతబస్తీలోని చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.


ఎమిత్ షా రోడ్ షో బిజెపి నేతలు ఊహించిన దానికన్నా మించి సక్సెస్ కావడంతో నాయకులు ఆనందం వ్యక్తం చేసారు. అమిత్ షా సైతం రోడ్ షోలో నగర వాసుల స్పందన చూసి  తెలుగులో ట్వీట్ చేసారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికలలో కమలం వికసించబోతున్నట్లు ఈ చిత్రాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి అంటూ చిత్రాలతో ట్వీట్ చేసారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు