ఇంకా ఓటమిని అంగీకరించని డోనాల్డ్ ట్రంప్

 అమెరికాలో జరగబోయే పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి


అగ్ర రాజ్య ఎన్నికలు ఓ ఎత్తు అయుతే ట్రంప్ మరో ఎత్తు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా తానే గెలిచానంటూ  పదే పదే ప్రకటనలు చేస్తున్నాడు. ఓ వైపు ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడక ముందే తానే గెలిచానంటూ ప్రకటించుకున్న ట్రంప్ కు ఆ తర్వాత దిమ్మ తిరిగే విదంగా ఫలితాలు వెలువడడంతో నిజంగా పిచ్చెక్కి పోయింది.  ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ గెలుపుతనదే నంటూ చెప్పుకున్నాడు. జో బైడెన్ గెలుపును గుర్తించకుండా ట్రంప్ వ్యవహార శైలి కొనసాగింది.  ట్రంప్ చేష్టలపై విమర్శలు చెల రేగడంతో ఆఖరికి జో బైడెన్ విజయం సాధించనట్లు అంగీకరించాడు. కాని బో బైడెన్ అద్యక్ష పీఠం కోసం మోసాలకు పాల్పడుతున్నాడంటూ మరో కొత్త వాదన లేవ దీసాడు. ఈ మేరకు ట్రంప్  స్వయంగా  'ఐ వన్ ది ఎలక్షన్' అంటూ ట్వీట్ చేసాడు. దాంతో ట్విట్టర్ ఆయన ట్వీట్ ను ఎప్పటి లాగే ఫ్లాగ్ మార్క్ చేసింది.  ట్రంప్ ట్వీట్ తో అమెరికన్లు ఆయన్ని బాగా ట్రోల్ చేసారు. ఇదిలా ఉంటే అమెరికా మాజి అధ్యక్షులు బరాక్ ఓబామా ట్రంప్ ను ఓటమి అంగీకరించాలంటూ సూచన చేశారు. దేశ గౌరవం కాపాడేందుకు ట్రంప్ హుందాగా వ్యవహరించాలని ఇకనైనా అహాన్ని పక్కన పెట్టి భాద్యతగా మసులు కోవాలని సలహా ఇచ్చారు.  ప్రస్తుత ఎన్నికల ఫలితాల అనంతరం   అమెరికా ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయినట్టు ప్రచారం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. ట్రంప్‌ నిరంతరం అసత్యాలు ప్రచారం చేస్తే ప్రత్యర్థి దేశాలు అమెరికా బాగా బలహీన పడిందని చులకన చేస్తాయని అన్నారు. తిది ఫలితాల మేరకు  బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. జో బైడెన్ గెలుపును అమెరికా జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌  అదికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాని ఇంత వరకు ఆ ప్రకటన వెలువడక పోవడంతో  ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రంప్ తన ఓటమిని అంగీకరించి శ్వేత సౌధం ఖాళి చేయని పక్షంలో ఎలాంటి పరిణామాలు జరగనున్నాయోనని ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెల కొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు