వరంగల్ ఆడ బిడ్డ హైదరాబాద్ మొదటి మహిళా మేయర్ రాణి కుముదిని దేవి



హైదరాబాద్ మొదటి మహిళా మేయర్ ఎవరో తెల్సా ? రాణి కుముదిని దేవి వరంగల్ ఆడబిడ్డ.. వనపర్తి సంస్థానాదీశుడు జనుంపల్లి రాజా రాం దేవ్ సతీమణి. రాణి కుముదిని దేవి 1962 సంవత్సరంలో హైదరాబాద్ మొదటి మహిళా మేయర్ గా పనిచేసారు. ఆమె ఏకగ్రీవంగా మేయర్ గా ఎంపికై రికార్డు నెలకొల్పారు. రాణి కుముదిని దేవి తండ్రి రాజ్ బహద్దూర్ పింగిళి వెంకట రామారెడ్డి. నిజాం సంస్థానంలో పోలీస్ అధికారిగా పనిచేసి అంచెలంచెలుగా తన కార్యదీక్షతో నిజాం మెపు పొంది హైదరాబాద్ కొత్వాల్ గా పనిచేసిన మొదటి హిందు అధికారి. ఈయన తన పదవి విరమణ అనంతరం నిజాం సంస్థానంలో ఉప ప్రధాన మంత్రిగా పనిచేసారు. నిజాం రాజ్యంలో హాదరాబాద్ నగరంలో కారు నడుపుతూ తిరిగిన మొదటి ఏకైక హిందూ మహిళ.

హైదరాబాద్ మేయర్ గా రాణి కుముదుని దేవి పనిచేసి ప్రశంసలు పొందారని చెబుతారు.  1962 నుండి 1972 వరకు ఆమె వనపర్తి శాసన సభా స్థానానికి ప్రాతినిద్యం వహించారు. రాణి కుముదుని సామాజిక సేవా రంగాల్లో అనేక కార్య.క్రమాలు నిర్వహించి పేరు ప్రఖ్యాతులు పొందారు.  అధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో పాటు పలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి కుష్టు రోగులకు అనాధ ఆడపిల్లలకు ఆశ్రయం కల్పంచారు. శివానంద మూర్తి భక్తురాలు అయిన రాణి కుముదిని ఓ స్వచ్చంద సంస్థను కూడ ఏర్పాటు చేసారు.  కుముదిని దేవి గారు ఆగస్టు 6, 2009 నాడు 98వ యేట కన్నుమూశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు