ఉద్రిక్తతగా మారిన ఛలో ఢిల్లీ

 


రైతుల ఛలో డిల్లీ ఉద్రిక్తతగా మారింది.  పోలీసులు రైతులు వచ్చే దారులు మూసి వేసి బారికేడ్లు అమర్చారు. దాంతో రైతులకు పోలీసులుక మద్య ఘర్షణ వాతావారణం నెలకొంది. ఢిల్లీ సరిహద్దులోని శంభు నదిపై పాటియాల-అంబాలా హైవేపై భారీగా మోహరించిన పోలీసులు రైతులను అడ్డిగంచారు. దాంతో కోపోద్రిక్తులైన రైతులు పోలీసులపై తిరగబట్టారు. పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి లాఠి చార్జి చేసినా వెనక్కు తగ్గ లేదు. వాటర్ కానాన్లతో రైతులపై జల ప్రయోగం చేసినా రైతులు పోలీసులను ప్రతిఘటించారు. బారి కేడ్లను తొలగించి నదిలో పడేసారు. 

పంజాబ్, హర్యానా  రైతులు భారి సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు. నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రైతులు విరామం లేకుండా పోరాటం చేస్తున్నారు. చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తు ఛలో డిల్లీ ఆందోళన చేపట్టారు. అయితే కరోనా రెండో వేవ్ తీవ్రంగా ఉందని ఆందోళనకు అనుతి ఇవ్వలేదు. అయినా రైతులు వాహనాల్లో తిండి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆందోళనకు ఢిల్లీ వైపు కదిలారు. డిల్లీకి దారి చీసే ప్రధాన రహదారుల్లో  పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు