బిజెపి గెలిస్తే ఎల్ఆర్ఎస్ రద్దు - బిజెపి ఎన్నికల మానిఫెస్టో


జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టి విజయం సాధిస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని  మహారాష్ట్ర మాజి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు.  ఎల్ఆర్ఎస్ పేరిట రాష్ర్ట ప్రభుత్వం ప్రజల నుండి 15 వేల కోట్లు ఆదాయం రాబట్టు కోవాలని భారం మోపిందని అన్నారు. 

 ఫడణవీస్ గురువారం హైదరాబాద్ లో బిజెపి పార్టి కార్యాలయంలో జిహెచ్ఎంసి ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేసారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు వరద సాయం కింద అర్హులందరికి 25 వేల చొప్పున అంద చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రదాన మంత్రి ఆవాస యోజన పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.  బిజెపి అధికారంలోక ివస్తే పేద వారి స్వంత ఇంటి కల నెరవేరుతుందన్నారు.

ఎన్నికల మానిఫెస్టోలో పల అంసాలను ప్రకటించారు. నగరం పరిదిలో అందరికి కరోనా వాక్సిన్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. మెట్రో,ఎంఎంటి లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలుగ చేస్తామని చెప్పారు. నగరంలో మహిళకు 15 మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిహెచ్ఎంసి లో ఖాలీలు భర్తి చేస్తామని మానిఫెస్టోలో పార్కొన్నారు. నగరంలో టూ వీలర్లు, ఆటోలపై పెనాల్టీలు రద్దు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఉచిత వైఫై కల్పిస్తామని టాబ్ లు ఇస్తామని చెప్పారు. మూసి ప్రక్షాళనకు ప్రత్యేక పథకం చేపడతామని చెప్పారు. ఉచితంగా 24 గంటల పాటు మంచి నీటి సదుపాయం కల్పిస్తామని తెలిపారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు