జాతీయ గీతం ఆ మంత్రి పదవికి ఎసరు తెచ్చింది

 


బీహార్ ముఖ్యమంత్రి నితీష్ మంత్రి వర్గంలో  విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మేవాలాల్ చౌద‌రీ మూడు రోజులకే పదవిని వదులు కోవాల్సి వచ్చింది.  గతంలో ఓ యూనివర్శిటీకి వైస్ చాన్స్ లర్ గా పనిచేసిన ఈ మనిషి మామూలోడు కాదంటూ సోషల్ మీడియాలో ఆమంత్రి అవినీతి భాగోతంతో పాటు జాతీయ గీతం సరిగ్గా పాడటం రాని మంత్రి అంటూ రాష్ట్రీయ జనతా దళ్ ట్రోల్ చేసింది. మంత్రి చిట్టా విప్పడంతో ఆయన మూడు రోజులకే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈయనకు మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్య.మంత్రి నితీష్ కుమార్ ను కూడ సిటిజెన్సు, నెటిజెన్సు వదల లేదు. ఇదేం  పద్దతంటూ నితీష్ ను ప్రశ్నించారు. మేవాలాల్ గతంలో భాగల్‌పూర్‌ వ్యవసాయ వర్సిటీకి వైస్‌ చాన్సలర్‌గా పని చేశారు. మంత్రుల జాబితాను స్వయంగా సిద్దం చేసిన నితీష్ కుమార్ విద్యావంతుడనే  కారణంతో మేవాలాల్ ను  ఏకంగా విద్యాశాఖ మంత్రిగా ఎంపిక చేసి ఉండవచ్చు. అయితే ప్రతిపక్షం దుమ్మెత్తి పోయడంతో అతని చేత రాజీనామా  చేియంచి ఉంటారని బావిస్తున్నారు.   మేవా లాల్ వైస్ చాన్స్ లర్ గా పనిచేసిన సమయంలో అధ్యాపకుల నియామకాల్లో బాగా లంచాలు మేసాడని ఫిర్యాదు ఉంది. ఈ విషయంలో ఆయనపై క్రిమినల్కేసు కూడ నమోదు చేసారు. అంతే కాకుండా ఆయన గతంలో ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మేవాలాల్‌ చౌదరి.. జాతీయ గీతం తప్పుగా ఆలపించారు. జనగణమన ఆలపించడానికి తీవ్ర ఇబ్బంది పడిన మేవాలాల్ "పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా"కు బదులుగా "పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా" అని పాడారు. ఈ వీడియోను ఆర్ జెడి  సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్  అయింది.  తన పై నమోదైన కేసులన్ని తప్పుడు కేసులని తాను కడిగిన ముత్యం లెక్క బయటకి వస్తానని మేవాలాల్ మీడియా వారితో చెప్పుకున్నాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు