దుబ్బాక ఫలితం మాకో అప్రమత్తం - టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

 కూర్చుంటాం..లోతుగా సమీక్షించుకుంటాం
అపజయాలకు కుంగి పోవయేది లేదు..విజయాలకు పొంగి పోయేది లేదు
 2014 జూన్ 2  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుండి నేటి వరకు ఏ ఎన్నికలు వచ్చినా.. పార్లమెంట్ ఎన్నికలు, శాసన సభ ఎన్నికలు గ్రామ పంచాయితి ఎన్నికలు.. ఏ ఎన్నికలు వచ్చినా అప్రతి హతంగా విజయాలు నమోదు చేసుకున్నాం. హుజూర్  నగర్ ఉప ఎన్నికల్లో అద్భుత విజయం నమోదు చేసుకున్నాం.  గతంలో మా పార్టి నాయకుడు చెప్పారు. ఏ ఎన్నికలు కాని విజయాలకు పొంగి పోయేది లేదు ..అపజయాలకు కుంగి పోయేది లేదు. దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో  మాకు ఓటు వేసిన 62 వేల పైచిలుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నాం..పార్టి గెలుపు కోసం అహర్నిశలూ కృషి చేసిన వారందరికి  హృదయ పూర్వకంగా  ధన్యవాదాలు తెలియ చేస్తున్నాం. ఫలితం మేమా  శించినట్లు రాలేదు.  ఆరున్నరేండ్ల కాలంలో ఎన్నో గెలుపులు ఎన్నో  విజయాలు నమోదు  చేసుకున్నాం. ఈ రోజు జరిగిన ఉప ఎన్నికలు  ఓ రకంగా కార్యకర్తలకు నాయకులందరికి కూడ ఓ రకంగా  అప్రమత్తం గా పని కొస్తుందని  నేను అనుకుంటున్నా. మేము ఆశించిన రీతిలో ఎందుకు ఫలితం రాలేదో మేము కూర్చుని లోతుగా  సమీక్షించుకుంటాం అర్దం చేసుకుని మా కార్యక్రమాలు పార్టి పరంగా ప్రభుత్వం పరంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సమీక్షించుకుంటాం.  పార్టి నాయకుడి ఆదేశాలమేరకు మా కార్యచరణతో ముందుకు పోతా మని అన్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు