దుబ్బాక ప్రజలు కెసిఆర్ కు దీపావళి గిప్టు ఇచ్చారు - హైదరాబాద్ ప్రజలు సంక్రాంతి గిఫ్టు ఇస్తారు - బండి సంజయ్


దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపిని గెలిపించి అక్కడి ప్రజలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు దీపావళి గిఫ్టు ఇచ్చారని అట్లనే జరగబోయే  జిహెచ్ఎంసి ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు సంక్రాంతి గిఫ్టు ఇస్తారని భారతీయ జనతా పార్టి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బుధవారం జూమ్ యాప్ ద్వారా జరిగిన పార్టి  ముఖ్య నాయకుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. బిజెపి ఎక్కడుందని కెసిఆర్ అన్నారని  ఇప్పిడు ఆయన స్వంత జిల్లా సిద్ధి పేటలోనే  బిజెపి ఎమ్మెల్యే ఉన్నాడని  బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రైతులను కెసిఆర్ మోసం చేసారని సన్న వడ్లు పండించమని చెప్పి ఆయన ఫాం హౌజ్ లో మాత్రం దొడ్డు వడ్లు పండించాడని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ తో ప్రజలపై భారం మోపి దోచుకుంటున్నాడని విమర్శించారు.  హైదరాబాద్ పాత బస్తీలో ఎన్ని పన్నులు వసూలు చేస్తున్నాడో ప్రభుత్వం లెక్కలు చెప్పటం లేదని అన్నారు. రాష్ట్ర నిధులన్ని పాత బస్తీలో ఖర్చు చేస్తున్నారని అన్నారు. జిహెచ్ ఎంసి ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకే 10 వేల చొప్పున పంపకాలు చేసారని అయితే వాటిని మద్యలోనే టిర్ఎస్ పార్టి నేతలు సగం కాజేశారని అన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ తో పేదల జీవితాలు నాశనం అయ్యాయని అన్నారు. ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.తెలంగామాలో 2023 లో బిజెపి అధికారంలోకి వస్తుందని ఏఅ్ననారు. హైదరాబాద్ జిహెచ్ ఎంసి ఎ్ననికల్లో బిజెపి గెలిిచ తీరుతుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. తాము ఛత్రపతి శివాజీ వారసులమైతే... కేసీఆర్ లాడెన్, బాబర్, అక్బర్ ల వారసుడని సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కేసీఆర్ ను బొంద పెడతామని, హిందువులను అవమానిస్తున్న ఎంఐఎంకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు