జో బైడెన్ గెలిచినట్లు ఎలక్టోరల్ కాలేజి ఒప్పుు కుంటే వైట్ హాజ్ ఖాళి చేస్తా- ట్రంప్ తాజా షరతు

 


జో బైడెన్ చేతిలో పరాజయం పాలైన డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఒక్కో మెట్టు దిగి వస్తున్నాడు. జనవరి 20 న జో బైడెన్  అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  అసలు జో బైడెన్ ఎన్నికను అంగీకరించని ట్రంప్ ఇంకా  నిరాధారమైన ఆరోపణలు చేస్తూనే మరో వైపు వేరే దారి లేక గత్యంతరం లేని పరిస్థితిలో  జో బైడెన్ కు మార్గం సుగమం చేస్తున్నాడు. ఎలక్టోరల్ కాలేజి జో బైడెన్ ఎంపికను అధికారికంగా వెల్లడిస్తే తాను వైట్ హౌజ్ ఖాళిచేస్తానంటూ  మరో షరతు పెట్టాడు. అయితే జో బైడెన్ గెలుపును  తాను  ఒప్పుకోవడం లేదని  ఒప్పు కోవడం చాలా కష్టమని కూడ చెప్పుకొచ్చాడు. నవంబర్ 3 న జరిగిన ఎన్నికల్లో  బైడెన్ కు 306 ఓట్లు రాగా ట్రంప్ కు 232 ఓట్లు వచ్చాయి. అమెరికా అధ్యక్ష పదవికి అవసరమైన మాజిక్ ఫిగర్ 270 కాగా  జో బైడెన్ కు అంతకు మించిన ఓట్లే పోలయ్యాయి.  ట్రంప్ ఓటమిని అంగీక రించకుండా మడత పేచీలు పెడుతున్నాడు.  ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని  కోర్టుల్లో వేసిన కేసులు నిలవలేదు.  చివరికి తనకు వ్యతిరేకంగా పనిచేశారని  కీలకమైన అధికారులపై కూడ ప్రతీకార చర్యలకు ఉపక్రమించాడు. అయితే  ట్రంప్ ఎంతగా అపహాస్యం పాలు అయ్యే విదంగా ప్రవర్తిస్తున్నా జో బైడెన్ మాత్రం అంతా సవ్యంగానే జరిగి పోతుందనే రీతిలో ప్రశాంతంగ  వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశ ప్రయోజనాల కోసం చేపట్టే కార్యక్రమాలపై ఆయన ఇప్పటికే దృష్టిపెట్టారు. పరిపాలనా అంశాలలో  తనకు కావల్సిన నమ్మకమైన అధికారులను ఎంపికి చేసుకునే పనిలో ఉన్నారు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు