ఊపర్ శేర్వాని అందర్ పరేశాని..కెసిఆర్ పై బండి సంజయ్ విమర్శలు

 


ఊపర్ శేర్వాని అందర్ పరేశాని... ఇది కెసిఆర్ పరిస్థితి భారతీయ జనతా పార్టి అంటే కెసిఆర్ కు భయం పట్టుకుంది. బాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఎక్కడుంది..పాకిస్తాన్ లో ఉందా..బంగ్లా దేశ్ లో ఉందా  భాగ్య నగరానికి ఆ పేరు వచ్చిందే భాగ్యలక్ష్మి దేవి పేరిట కాదా అంటూ భారతీయ జనతా పార్టి రాష్ట్ర అధ్యక్,ులు బండి సంజయ్ ప్రశ్నించారు. 

శనివారంఆయన మీడియా తో మాట్లాడుతూ వరద సహాయం పై తాను లేఖ రాయలేదని నిరుపించేందుకే ఆలయానికి వెళ్లాలని అన్నారు. ముఖ్యమంత్రి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మరో దేవాలయానికి వచ్చేందుకైనా సిద్దమని ఎక్కడి రావాలో చెప్పాలని అన్నారు. వరద సహాయం  నిలిపేవేయాలంటూ రాసిన లేఖ తాను రాసింది కాదని స్టేట్ ఎలక్షన్ కమీషన్ కూడ స్పష్టం చేసిందని అయినా తమ పార్టిని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.  దుబ్బాక ఎ్ననికల్లో మాట్లాడిన వీడియోలను మార్ఫింగ్ చేసి దొంగ వీడియాలో సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. లేఖ పోర్జరి జరిగిందని పోలీసులుక పిర్యాదు చేసనా ఇంత వరకు చర్యలు లేవిన అన్నారు.

బల్దియాలో బిజెపి జెండా ఎగుర వేయడం ఖాయమని గతంలో 10 వేల సహాయం పొందిన వారికి కూడ మరో 10 వేలు ఇస్తామని అన్నారు. బిజెపిని కంట్రోల్ చేయాలని టిఆర్ఎస్ చూస్తోందని అన్నారు. తమ పార్టీని కంట్రోల్ చేసే శక్తి కేవలం ప్రజలకు మాత్రమే ఉందన్నారు. కేవలం 30 శాతం ఉన్న ముస్లీం ల గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవచ్చు కాని...80 శాతం హిందువుల గురించి నేను మాట్లాడితే తప్పా అంటూ ప్రశ్నించారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు