ఎమ్మెల్సీలుగా గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్

                  దక్కిన పెద్దరికం

గోరటి ఎంకన్నకు హోదా వచ్చింది. బస్వరాజు సారయ్య నిరీక్షణ ఫలించింది.  దయానంద్ పై దయ తలిచారు


గవర్నర్ కోటాలో రాష్ట్ర శాసన‌మండ‌లిలో ఖాళీగా ఉన్న  మూడు ఎమ్మెల్సి  నామినేటెడ్ స్థానాలు ఎట్టకేలకు భర్తి చేస్తూ శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది.

 ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవా కేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ ముగ్గురి పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపించింది. సనివారం వీరు ముగ్గురూ ప్రమాణ స్వీకారం చేచబోతున్నారు. 

గోరటి వెంకన్న...ప్రముఖ జానపద వాగ్గేయ కారుడిగా సుప్రసిద్దుడైన గోరటి వెంకన్న తన పాట ద్వారా తెలంగాణ మట్టి వాసనలు పరిమళింప చేసారు. కోఆపరేటివ్ డిపార్ట్ మెంట్ లో సబ్ డివిజనల్ అధికారిగా పనిచేసారు. ఉస్మానియా యూనివర్శీటీ డిస్టాన్స్ ఎడ్యుకేషన్ లో ఎంఏ తెలుగు  ఆయన విద్యార్ఙతలు. 1994 లో ఏకు నాదం మోత, 2002 లో రేల పూతలు, 2010లో అలసేంద్ర వంక, 2016 పూసిన పున్నమి, 2019 లో వల్లంకి తాలం, ది వేవ్ ఆప్ ది క్రిసెంట్ అనే పుస్తకం 2019 లో ఇంగ్లూషులే అచ్చయ్యింది. దీన్ని మంతేన దామోద చారి, అల్గతు తిరుపతి రెడ్డి ఇంగ్లీషులో తర్జుమా చేసారు. రేలపూతలకు ఉత్తమ గేయ కావ్య పురస్కారం లభించింది.అలసేంద్ర వంకకు సినారే సాహితి పురస్కారం లభించింది. 

తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలతో తెలంగాణ ప్రజలను ఉత్తేజితులను చేశారు. కళాకారుడిగా వెంకన్న కాళోజి, సినారే, ఉగాది, హంస అవార్డులతో పాటు కబీర్ సమ్మాన్, లోక్ నాయక్ అవార్డులు లభించాయి.


బస్వరాజు సారయ్య

బలహీన వర్గాలకు చెందిన బస్వ రాజు సారయ్య వెనుక బడిన కులాలలో అత్యంత వెనుక బడిన కులం చాకలి కులానికి చెందిన వారు. కార్పోరేటర్ స్థాయి నుండి మంత్రిగా ఎదిగారు. మూడు టర్ములు కార్రోరేటర్ గా వరంగల్ మున్సిపల్  వైస్ చైర్మన్ గా  పనిచేసారు. జిల్ాల కాంగ్రేస్ పార్టి అధ్యక్షులుగా  పనిచేసారు. 1999, 2004, 2009 లో ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.2012 నుండి 2014 వరకు రాష్ట్ర బి.సి సంక్షేమ సాఖ మంత్రిగా పనిచేసారు.  సిట్టింగ్ మంత్రిగా 2014 ఎన్నికల్లో ఓటమి చెందారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఏడు సంవత్సరాలుగా టిఆర్ ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. 

బొగ్గారపు దయానంద్

ఈన 2014 లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వైశ్య కమ్యునిటీకి చెందిన దయానంద్ ప్రోటో కాల్ డిప్యూటి డైరెక్టర్ గా పనిచేస్తు 2003 లో వాలంటరి రిటైర్ మెంట్  తీసుకుని తెలుగు దేసం పార్టీలో చేరారు. గోశామహల్ అసెంబ్లి స్థానానికి 2009, 2014 లో పోటి చేసేందుకు టిడిపి టికెట్ ఆశించినా రాలేదు.  ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. ఆర్య వైశ్య సంఘాలకు ఆయన గౌరవ అధ్యక్షులుగా పనిచేసారు.  వాసవి కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటి జనర్ సెక్రెటరీగా, ఆర్యవైశ్య హాస్టల్ ముషీరాబాద్ సెక్రెటరీగా వాసవి సేవా కేంద్రం  ముఖ్య సలహా దారుగా ఉన్నారు. 

పలువురికి నిరాశ

 కర్నె ప్రభాకర్ కు దక్కని రెండో చాన్స్..దేశపతికి భంగ పాటు

ఎమ్మెల్సి పదవులు ఆశించిన పలువురు టిఆర్ఎస్ నాయకులు భంగ పడ్డారు. కర్నె ప్రబాకర్ కు రెండ ో సారి పదవి లభిస్తుందని అంతా అనుకున్నారు కాని అలా జరగ లేదు. భారత మాజి ప్రదాని కూతురు శ్రీవాణి పేరు కూడ వినిపించింది కాని నామినేట్ చేయలేదు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన రవీందర్ రావు ఈ సారి తనకు ఖాయమనుకున్నారు కాని చాన్స్ రాలేదు.  ఎవరి ఊహలో లేని నగరానికి చెందిన ఆర్య వైశ్య నాయకుడు దయానంద్ కు అనుకోని విదంగా పదవి కల్సి వచ్చింది. అ్ననింటికంటే  ఆశ్చర్యం ఏమిటంటే  సిఎం పేషీలో ఓస్డీగా ఉన్న దేశ పతి శ్రీనివాస్ కు  ఈ సారి తప్పని సరి ఎమ్మెల్సి వస్తుందని అనుకున్నారు కాని ఎందుకో రాలేదు.వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు