వరద సాయంపై బురద - కెసిఆర్ వర్సెస్ బండి సంజయ్

బిజెపి ఫిర్యాదు వల్లే వరద సహాయం నిలిచి పోయింది..కెసిఆర్ ఫైర్

భాగ్య లక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తావా .. బండి సంజయ్ సవాల్

 

హైదరాబాద్ నగరంలో వరద భాదితుల సహాయాన్ని రాష్ట్ర ఎ్ననికల కమీషన్ నిలిపి వేయడం సరికొత్త వివాదానికి తెర తీసింది.  ఆన్గోయింగ్ పథకాలు ఆప బోమంటూ ఎన్నికలకమీషనర్ పార్సారాధి ప్రకటన చేసి 25 గంటల గడవక ముందే తిరిగి సహాయాన్ని నిలిపి వేయాలని ఆదేశాలు జారి చేయడంతో టిఆర్ఎస్, బిజెప్ నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే పరిస్థితి నెల కొంది. బిజెపి కావాలనే వరద సహాయాన్ని నిలిపి వేయించిందని సిఎఁ కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.  బిజెపి నాయకులు చేసిన ఫిర్యాదు తర్వాతే ఎ్ననికల కమీషన్ ఈ నిర్ణయం తీసుుకందని అన్నారు. అమ్మ పెట్టదు అడుక్క తిన నివ్వదు అనే విదంగా బెజెపి వ్యవహారం ఉందన్నారు.

గ్రేటర్ ఫలితాలు వెలవడే వరకు ఇక వరకు సహాయం నిలిచి పోనుంది. బుధవారం తెల్లవారు జామునుండే మీ సేవా కాంద్రాల దగ్గర జనం వరద సహాయం  వివరాలు నమోదు చేయుంచు కునేందుకు బారులు తీరారు. ఓ దశలో తొక్కిస లాట జరుగుతుందా అనే రీతిలో మహిళలు కేంద్రాల వద్ద గొడవ పడ్డారు. పోలీసులు కూడ కంట్రోల్ చేయ లేక పోయారు. ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు.గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వరద సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉదయం నుంచి ‘మీ సేవ’ కేంద్రం వద్ద నిల్చున్న ఓ మహిళ స్పృహతప్పి పడిపోయి చనిపోయింది. 

లేఖ ఫోర్జరి చేసారు.....చార్మినార్ భాగ్యలక్ష్మి  ఆలయంలో ప్రమాణం చేస్తావా అంటూ బండి సంజయ్ సవాల్

సిఎం కెసిఆర్  చేసిన వ్యాఖ్యలను బెజిపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తిప్పి కొట్టాడు. కావాలానే బిజెపి పై నిందలు వేశారని విమర్శించారు. కెసిఆర్ తీరుపై  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సాయాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి తాను లేఖ రాయలేదని అన్నారు. తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీ ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. వరద సాయాన్ని బీజేపీ ఆపిందని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేస్తావా? అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు.

వరద సాయం కోసం క్యూలో నిల్చున్న మహిళ చనిపోవడం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని బండి సంజయ్ అన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాదులో సమావేశం నిర్వహిస్తామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ స్పందిస్తూ... గతంలో కేసీఆర్ చెప్పిన ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో జనాలంతా చూశారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తొత్తులా మారిందని విమర్శించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు