ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా

  •  జిహెచ్ఎంసి ఎన్నికలు జరుగుతున్న  హైదరాబాద్ బిజెపి నేతల తుఫాన్ 

  • శుక్రవారం రోడ్ షోలో పాల్గొన్న్ బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డా
  • పార్టీని గెలిపించుకోవడం కోసం గల్లీకే కాదు ఎక్కడికైనా వస్తాం


జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో శుక్రవారం భారతీయ జనతా పార్టి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా పాల్గొన్నారు. బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న నడ్డాకు ఎమ్మెల్యే రాజాసింగ్, పెద్దిరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ స్వాగతం పలికారు. నడ్డా నేరుగా బేగంపేట నుంచి కొత్తపేటకు చేరుకుని అక్కడి నుండి నాగోల్ వరకు జరిగే రోడ్ షో లో పాల్గొన్నారు. రోడ్ షో సమయంలో జోరున వర్షం కురుస్తున్నా ప్రచారం కొనసాగించారు.  

ఈసదంర్భంగా నడ్డా టిఆరాఎస్పార్టీ పైనా ముఖ్యమంత్రి కెసిఆర్  ఆయన కుమారుడు కెటిఆర్ పైనా విమర్శలు సంధించారు.  నగరంలో ప్రతి డివిజన్ లో బిజెపి జెండా ఎగురుతుందని ప్రజల స్పందన చూస్తే తెలుస్తోందన్నారు. కెసిఆర్ పాలనకు పాలనకు ప్రజలు ముగింపు పలకాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రజలు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారన్నారు.  తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేశారని అన్నారు. బిజెపి అధ్వర్యంలో హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకు వెళుతుందన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు.  గల్లి ఎన్నికలకు ఢిల్లీ నుండి వస్తున్నారని కెటిఆర్ చేసిన విమర్శలు తిప్పు కొట్టారు. పార్టికోస ంఎక్కడికైనా వస్తామని అన్నారు. టిఆర్ఎస్నేతల ఆటలు ఇక సాగబోవన్నారు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు