సిఎం,డిజిపిల ప్రకటనల పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బిజెపి నేతలు


ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డిలు శాంతి భద్రతల సమస్యపై చేసిన ప్రకటనలపై తీవ్ర అభ్యంరాలు వ్యక్తం చేస్తూ బారతీయ జనతా పార్టి నాయకులు శుక్రవారం గవర్నర్ ను కల్సి ఫిర్యాదు చేశారు.  ఓట్ల కోసం ఎన్నికల్లో శాంతి భద్రతలకు ప్రమాదం కలగ బోతున్నదనే దుష్ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. 

టిఆర్ఎస్ పార్టి చేసిన కుట్రలను గవర్నర్ కు వివరించామని బిజెపి ఓబిిస జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ తెలిపారు. టిఆర్ఎస్ పార్టి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు ఓటర్ల జాబితాలో దొంగ ఓటర్లు చేర్చారని ఆరోపించారు. కేంద్ర  హోం మంత్రి అమిత్ షా వస్తే టిఆర్ఎస్ నేయకులకు ఎందుకు భయమని ప్రశ్నించారు. నగరంలో పథకం ప్రకారం శాంతి భద్రతల సమస్య సృష్టించి ఎన్నికలు వాయిదా వేయించాలని సిఎం కెసిఆర్ పథక రచన చేశాడని విమర్శించారు.  పాతబస్తీలో  ఎంఐఎం పార్టి నాయకుల పట్ల పేద ముస్లీం వర్గాలలో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు