మహా నగరంలో మోగిన నగారా - క్లారిటి ఇచ్చిన బిజెపి

 జన సేన కన్ ఫ్యూజన్ - కమలం క్లారిటి
హైదరాబాద్ మహా నగర ఎన్నికలు 


మహానగర ఎన్నికల నగారా మోగింది. పార్టీలు ఒంటరిగానే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి.  పవన్ కళ్యాన్ జన సేన జిహెచ్ఎంసిలో పోటీలో నిలవ బోతచున్నట్లు బాంబు పేల్చింది. బారతీయ జనతా పార్టీతో ఎపిలో సంభంద బాందవ్యాలు పెట్టుకున్న జన సేన తెలంగాణలో  ఒంటరిగా పోటికి దిగడం వెనక వ్యూహం ఏమిటనే చర్చ మొదలైంది.  పవన్ కళ్యాన్ జన సేన పోటీ కొంచెం కన్ ఫ్యూజన్ గానే ఉన్నా  బిజెపి మాత్రం క్లారిటీతో నే ఉంది. జన సేన వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టమో అనేది ఇప్పటి కిప్పుడు తేలేది కాదు.  బిజెపి నేతల మనసుల్లో ఏముందో కాని పైకి మాత్రం తాము ఒంటిరిగానే పోటీ చేస్తామని  ఆ పార్టి అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటన చేసారు. జన సేనతో ఎపిలో పొత్తు ఉందని కాని తెలంగాణ లో లేదని  సోమవారం క్లారిటి ఇచ్చారు.  బిజెపిఒంటిరిగానే 150 డివిజన్లలో పోటి చేస్తుందని ప్రకటించారు.

ఇక జన సేన ఎన్ని సీట్లకు పోటి చేస్తుందనే విషయంలో క్లారిటి రావాల్సి ఉంది. బలంగా ఉన్న డివిజన్లలో చేస్తుందా 150  డివిజన్లలో పోటి చేస్తుందా అనేది తెలియాల్సి  ఉంది. ‘‘తెలంగాణతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయి. వారి వినతి మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులు, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశాను. నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై చర్చించుకున్నారు. జీహెచ్‌ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ.. ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయి. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుంది’’ అంటూ పవన్ కళ్యాన్ ఓ లేఖ విడుదల చేసారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు