భాగ్య నగర్ వాసులకు బంపర్ ఆఫర్లు - వరద నష్టంపై బిజెపి హామీల వర్షం

 




రెండు నెలల పాటు వరదల్లో విల విల లాడిన భాగ్యనగర్ వాసులను ఆదుకున్న పాపాన పోని పార్టీలు జిహెచ్ఎంసి ఎన్నికల్లో  మాత్రం హామీలపై హామీలు కురుపిస్తున్నాయి.  భాగ్యనగర్ వాసులకు దుబ్బాక విజయంతో మంచి జోష్ మీద ఉన్న బారతీయ జనతా పార్టి గెలుపే లక్ష్యం హామీల వర్షం కురుపించింది. గురువారం బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ఎన్నికల్లో బిజెపి గెలిస్తే వరదల్లో నష్ట పోయిన వారందరికి సహాయం చేస్తామని ఆ పార్టి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు. ఇంటింటికి 25 వేల రూపాయలు ఇస్తామని కారాలు, బైకులు చెడి పోతే ఇస్తామని ఇండ్లలో దెబ్బతిన్న ఫర్నిచర్ కూడ సమకూరుస్తామని చెప్పారు. ఏ ఇంటికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి  కేంద్రం నుంచి నిధులు రప్పిస్తామని సంజయ్ అన్నారు.

ఇళ్లు కూలిపోతే ఇళ్లు కట్టిస్తాం. బైక్‌లు పోతే బైక్‌లు కొనిస్తాం.. కార్లు పోతే కార్లు కొనిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. కేసీఆర్‌కు రూ.10 వేలు ఇచ్చే యోచన ఉంటే నేరుగా ఇవ్వొచ్చు కదా అని సంజయ్ సూచించారు.  వరద సహాయాన్ని నిలిపి వేసి బిజెపి ని బద్ నాం చేసే కుట్ర చేశారని విమర్శించారు.

చలాన్ల పేరిట ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బైక్ మీద ముగ్గురు యువకులు వెళ్తే చలాన్లు విధిస్తున్నారు. బీజేపీ జీహెచ్ఎంసీ మేయర్ పదవిని చేపట్టిన తర్వాత.. భాగ్యనగర పరిధిలో వసూలు చేసిన చలాన్లను మొత్తం మేమే కడతాం. చలాన్ల కారణంగా ఎక్కువగా యువకులే ఇబ్బంది పడుతున్నారు. ఓల్డ్ సిటీలో ఎన్ని చలాన్లు వసూలు చేస్తున్నారు..? అక్కడి వాళ్లే మనుషులు.. బయటి వాళ్లు కాదా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో బీజేపీ గెలిస్తే.. ముఖ్యమంత్రి దిగొస్తాడు.. ఎల్‌ఆర్ఎస్‌ను రద్దు చేస్తాడని బండి సంజయ్ అన్నారు. మందుపే చర్చ కావాలా లేక చామ్ పే చర్చ కావాలా అని ప్రశ్నిస్తు ఉగ్రవాదులను పెంచి పోషించే హైదరాబాద్ కావాలా ? దేశభక్తులకు నిలయమైన హైదరాబాద్ కావాలో తేల్చుకోవాలని  అన్నారు.

వరద సాయం ఆపాలని తాను ఎన్నికల సంఘాన్ని కోరలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. ఇది కేసీఆర్ కుట్ర అని ఆరోపించారు. కేసీఆర్ నిజంగా హిందువైతే.. చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడి దగ్గరకు రేపు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి ప్రమాణం చెప్పాలన్నారు.

నగర వాసులకుఉచిత వై.ఫై-తెరాస

టిఆర్ఎస్ పార్టి తన16 పేజీలతో కూడిన మేనిఫెస్టోలో ఉచిత వై.ఫై ని ప్రధానాంశంగా చేర్చింది.ఈ ఎన్నికల్లో తెరాస విజయభేరీ మోగిస్తే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉచిత వైఫై సౌకర్యం కల్పించనున్నట్టు పేర్కొంది.

అలాగే, నగరంలో కొత్తగా 4 ఆడిటోరియాల నిర్మాణం, అన్ని గ్రంథాలయాల ఆధునికీకరణ, రూ.130 కోట్లతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్లు, రూ.1900 కోట్లతో మరో 280 కి.మీ. మేర మిషన్ భగీరథ పైప్ లైన్, మూసీ సుందరీకరణ తదితర హామీలున్నాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు