ట్రంప్ ఓడిపోతే ? ఏం జరుగుతుంది ?!

 


అమెరికా ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొల్పాయి. అందరి దృష్టి డోనాల్డ్ ట్రంప్ పై నిలిచింది. జోబైడెన్ గెలిచినా ఓడినా జరిగే పరిణామాలకన్నా ట్రంప్ గెలిస్తే ఓడిపోతే జరిగే పరిణామాలపై చర్చ జరుగుతోంది. బైడెన్ అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు అవసరమైన మాజిక్ ఫిగర్ కు అతి  చేరువలో  ఉన్నారు. ట్రంప్ తన పదవి నిలుపుకునేందుకు చాలాదూరంలో ఉన్నాడని ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల ఫలితాల వల్ల  అర్దం అవుతోంది.  

అయితే ట్రంప్ గెలిచినా ఓడినా జరిగే పరిణామాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ట్రంప్ దాదాపు ఓటమి పాలైనట్లే నని అమెరికా మీడియాలో పరోక్షంగా వార్తలు వచ్చాయి. 


ఒక వేళ ట్రంప్ ఓడితే గలిస్తే  పరిస్థితి ఏమిటన్న అంశాలపై అమెరికా మీడియా విశ్లేషణ చేసింది. న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, ది టెలిగ్రాఫ్ వంటి పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి.

ట్రంప్ ఓడితే ఆయన ఇప్పుడప్పుడే శ్వేథ సౌధం నుండి మూటా ముల్లె సర్దుకుని  ఠికానామార్చే అవసరం లేదు. ట్రంప్ 2021 జనవరి 20 వరకు శ్వేథ సౌదలో  చక్కగా ఉండవచ్చు. రెండు నెలలకు పైగా అధికారికంగా అమెరికా అధ్యక్షులు గానే  చలామనిలో  ఉంటాడు. 

అదే ఇప్పుడు భయం కలిగిస్తున్న అంశంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ తత్వాన్ని బట్టి ఆయన అంత ఈజీగా ఓటమి అంగీకరించే వ్యక్తి కాదు. అధ్యక్ష పదవిని జార విడుచుకో కూడదని సర్వ శక్తులు ఒడ్డాడు. అయినా ప్రతి కూల పరిస్థితులు ఎదురు కావడంతో జీర్ణించుకోలేక పోతున్నాడు. ఓ వైపు ఫలితాలుపూర్తిగా వెలువడక ముందే  తానె  గెలిచానని ఇక సంబరాలే ఆలస్య మంటూ  శ్వేత సౌధం నుండి ప్రకటన చేస్తూనే మరో వైపు కోర్టు కెక్కారు.

అమెరికా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం వంటి సోషల్ మీడియాపై ట్రంప్ కు పీకల దాకా కోపం ఉంది. ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో ట్రంప్ కు వ్యతిరేకంగా కాంపెయిన్ నడిచింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ట్రంప్ ను ఓ ఆట ఆడుకుంది.

ఫాక్స్  న్యూస్ ఛానెల్ అయితే  పూర్తిగా ట్రంప్ కు వ్యతిరేకంగా మారింది.  ఇవవ్ని పక్కకు పెడితే కరోనా మహమ్మారి తీవ్రత కారణంగా అమెరికా అతలాకుతలం అవుతుంటే ట్రంప్ వెకిలి చేష్టలతో సరిగ్గా ప్రణాళికలు లేకుండా వ్యవహరించారని  ట్రంప్ వ్యవహార శైలిపై నేరుగా   అంటువ్యాధుల నిపుణుడు డా. అంథోనీ ఫౌసీ‌ విమర్శలు గుప్పించాడు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే కూడ ట్రంప్ ను తప్పు పట్టారు. ఎన్నికల సమయం కావడంతో వారిద్దరిపైనా ట్రంప్ ప్రతీకారం తీర్చుకునేందుకు వెనుకాడాడు కాని ఇప్పుడు ఓడి పోయిన పక్షంలో మరో రెండు నెలలు అధికారంలో కొనసాగే ట్రంప్ వారిని ఊరికే వదిలేస్తారా అనే చర్చ అమెరికా మీడియాలో  జరుగుతోంది.  ఓడినా గెలిచినా ట్రంప్ తన మనసులో వ్యతిరేక ముద్రలు పడిన అంశాలపై ప్రతీకార చర్యలకు దిగవచ్చనే  అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఇక ఇండో అమెరికన్ల  పట్ల కూడ ట్రంప్  ఆశలు పెట్టుకున్నంతగా ఎన్నికల్లో వారి  ఆదరణ పొంద లేక పోయారు. ఇండియన్లు ట్రంప్ తో పాటు జో బిడన్ కు బాగా సహకరించారు.  ట్రంప్ పోతూ పోతూ  ఇవన్ని మనసులో పెట్టుకుని ఏం హాని తెలపెడతారానని భయం నెలకొంది. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు